ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: పహల్గాం దాడి.. స్పందించిన పాక్ ప్రధాని

ABN, Publish Date - Apr 26 , 2025 | 02:49 PM

Pahalgam Terror Attack: పహల్గాం దాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. అలాంటి వేళ.. పాక్ ప్రధాని తొలిసారిగా పహల్గాం దాడిపై స్పందించారు.

PAK PM

ఇస్లామాబాద్‌, ఏప్రిల్ 26: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగి 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్‌,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.ఆ క్రమంలో న్యూఢిల్లీ తీసుకున్న పలు నిర్ణయాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తాజాగా స్పందించారు. పహల్గాం దాడి‌పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ఆయన ప్రకటించారు.అందులోభాగంగా తాము ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ స్పష్టం చేశారు.

శనివారం ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో షెహబాజ్‌ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటన కారణంగా మన దేశం మరోసారి నిందలు ఎదుర్కొంటోందన్నారు. ఆ ఘటనపై తటస్థ,పారదర్శక,విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శాంతికే తమ ప్రాధాన్యని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తాము సైతం ఖండిస్తామని తెలిపారు.


పహల్గాం ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ప్రధాని మోదీ స్పందనపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోమన్నారు. ఎలాంటి ముప్పును ఎద్కొవడానికైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు.ఇక పాకిస్థాన్ లక్ష్యంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు తామే బాధ్యులమంటూ పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు.. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భారత్‌ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైప భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు మండిపడిన విషయం విదితమే.

ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: చెలరేగిపోయిన ఉగ్రవాదులు.. వెలుగులోకి మరో వీడియో..

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Pahalgam Terror Attack: ముమ్మర తనిఖీలు.. పోలీసులు అదుపులో 400 మంది

Pahalgam Terror Attack: మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..

Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య

Updated Date - Apr 26 , 2025 | 02:51 PM