Share News

Pahalgam Terror Attack: చెలరేగిపోయిన ఉగ్రవాదులు.. వెలుగులోకి మరో వీడియో..

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:45 PM

Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పుల్లో 26 మంది మరణించారు. అయితే ఈ కాల్పులు జరుపుతోన్నప్పుడు మీది ఏ మతమంటూ వారు ప్రశ్నించి మరీ కాల్చి చంపారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

Pahalgam Terror Attack: చెలరేగిపోయిన ఉగ్రవాదులు.. వెలుగులోకి మరో వీడియో..
Pahalgam Attack

భారత్ నిత్యం శాంతి జపం చేస్తోంది. కానీ పక్కనే ఉన్న పాకిస్థాన్ మాత్రం తన దుందుడుకుతనంతో భారత్‌‌‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందులోభాగంగా మార్చి 22వ తేదీ జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో బైసరన్ మైదానంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మీ మతం ఏమిటంటూ వారిని ప్రశ్నించడం.. వాళ్లు సమాధానం చెప్పే లోగా వారిపై కాల్పులకు జరిపారు. దీంతో మొత్తం 26 మంది మరణించారు. అయితే అమయాకుల తలలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతోన్న ఓ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

పహల్గాం అంటేనే మిని స్విట్జల్లాండ్. అలాంటి ప్రాంతంలోని ఆందాలను వీక్షించేందుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి పహల్గాంకు తరలి వస్తారు. అదీకాక..అమర్‌నాథ్ యాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం మాత్రం ఈ పహల్గాం నుంచే వెళ్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ యాత్ర సైతం ప్రారంభం కానుంది.


ఇక ఈ కాల్పుల ఘటనపై మోదీ సర్కార్ సీరియస్ అయింది. ఈ దుశ్చర్యకు పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదం కారణమని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ దాడికి పాల్పడిన నలుగురిలో ఇద్దరు పాకిస్థానీలు, ఇద్దరు కాశ్మీర్ వాసులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకొంది.


సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అలాగే భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లేందుకు 48 గంటలు కేటాయించింది. సరిహద్దు వద్ద అటారీ ప్రాంతాన్ని మూసి వేసింది. న్యూడిల్లీలోని పాకిస్థాన్ రాయబారిని సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని.. ఆదేశించింది. అందుకు వారం రోజులు గడువు విధించింది. ఇక పహల్గాంలో జరిగిన ఈ దారుణం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని అందుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందు భారత్ ఉంచింది.


మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్‌పై ఆంక్షలు విధించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. వీటిని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఇంకోవైపు సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశముందని పాక్ భావించింది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర మూకల స్థావరాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇవి కూడా చదవండి..

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Pahalgam Terror Attack: ముమ్మర తనిఖీలు.. పోలీసులు అదుపులో 400 మంది

Pahalgam Terror Attack: మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..

Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య

DGCA: పాక్‌ గగనతలంలోకి నో ఎంట్రీ.. డీజీసీఏ కీలక సూచన

Updated Date - Apr 26 , 2025 | 02:07 PM