ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shahid Khattak: పాక్‌ ప్రధాని పిరికిపంద

ABN, Publish Date - May 10 , 2025 | 04:42 AM

భారత్‌ డ్రోన్‌ దాడులపై పార్లమెంటులో పాక్‌ ప్రధాని షెహబాజ్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగితే మదర్సా విద్యార్థులను రక్షణ దళాలుగా ఉపయోగిస్తామని పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ప్రకటించారు.

మోదీ పేరు పలికేందుకే షెహబాజ్‌ వణుకుతున్నారు

సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో ఓటమే

ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా

పోరాడతారు?: పాక్‌ విపక్ష ఎంపీ షాహిద్‌ ధ్వజం

భారత డ్రోన్‌ దాడులపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో

ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు

న్యూఢిల్లీ, మే 9: భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ అట్టుడికింది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాటు పాక్‌లోని అనేక ప్రాంతాల్లో డ్రోన్లతో భారత్‌ దాడులుచేసిన నేపథ్యంలో విపక్షాలు ప్రధాని షెహబాజ్‌ షరీ్‌ఫపై విమర్శలు ఎక్కుపెట్టాయి. షెహబాజ్‌ పిరికిపంద అని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పీటీఐ

ఎంపీ షాహిద్‌ అహ్మద్‌ ఖట్టక్‌ విమర్శించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పలికేందుకే షెహబాజ్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్‌ కొటేషన్‌ను ఆయన ఉటంకించారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయన్నారు. సరిహద్దుల్లో ఉన్న పాక్‌ సైనికులు ధైర్యంగా పోరాడాలనుకున్నా దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు ఎలా పోరాడగలరని ఆయన ప్రశ్నించారు. పిరికిపందలా ఉన్న ప్రధాని సరిహద్దుల్లో ఉన్న సైనికులకు ఏం ఆదేశాలు ఇవ్వగలరని షెహబాజ్‌ను ఉద్దేశించి షాహిద్‌ వ్యాఖ్యానించారు.


భారత డ్రోన్లను అందుకే కూల్చలేదు

భారత డ్రోన్లను ఎందుకు కూల్చలేకపోయారంటూ నేషనల్‌ అసెంబ్లీలో విపక్ష సభ్యులడిగిన ప్రశ్నలకు పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ సమాధానమిచ్చారు. తమ గగనతల రక్షణ వ్యవస్థల లొకేషన్ల వివరాలు తెలియకూడదనే వ్యూహాత్మకంగా భారత డ్రోన్లను కూల్చలేదన్నారు. అంతే తప్ప సామర్థ్యం లేక కాదన్నారు.

ఉద్రిక్తతలు పెరిగితే మదర్సా విద్యార్థులను వాడుకుంటాం

మదర్సాల్లోని విద్యార్ధులను మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ద్వితీయ శ్రేణి రక్షణ దళాలుగా పేర్కొన్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగితే పరిస్థితులను బట్టి మదర్సా విద్యార్థులను వంద శాతం వాడుకుంటామన్నారు. మదర్సా విద్యార్థులను భారత్‌కు వ్యతిరేకంగా వాడుకుంటామంటూ పాక్‌ మంత్రి ఒకరు నేషనల్‌ అసెంబ్లీలో బహిరంగంగా అంగీకరించడం ఇదే ప్రథమం. పాక్‌లోని మదర్సాల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఇస్లామిక్‌ విద్యను అభ్యసిస్తుంటారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:42 AM