ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Military: పాక్‌ ఆకాశ నేత్రం నేలమట్టం

ABN, Publish Date - May 10 , 2025 | 05:28 AM

భారత్‌ సైన్యం 15 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసిన పాకిస్థాన్‌ క్షిపణి, డ్రోన్ల దాడిని సమర్థవంతంగా అడ్డుకుని, పాక్‌కు కీలకమైన అవాక్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పాకిస్థాన్‌ వైమానిక వ్యూహానికి తీవ్రమైన దెబ్బగా మారింది.

‘అవాక్స్‌’ను కూల్చివేసిన భారత సైన్యం

వైమానిక రాడార్‌ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ

న్యూఢిల్లీ, మే 9: భారత్‌లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌ చేసిన దాడి ప్రయత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేసింది. పాక్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేయడమే కాకుండా.. ఆ దేశానికి అత్యంత కీలకమైన ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (అవాక్స్‌)ను కూడా కూల్చివేసింది. ఆకాశ నేత్రంగా పిలిచే అవాక్స్‌ అనేది ఒక వైమానిక రాడార్‌ వ్యవస్థ. రాత్రివేళ దాడి కోసం పాక్‌ దీన్ని యాక్టివేట్‌ చేసింది. ముందే గుర్తించిన భారత్‌... పంజాబ్‌ ఫ్రావిన్స్‌లో దాన్ని కూల్చివేసింది. ఇది పాక్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బే. ఎందుకంటే ఈ విమానం ఓ సాధారణ రాడార్‌ కాదు. శత్రు విమానాలు, క్షిపణుల కదలికలపై నిఘా పెట్టి, కీలక సమాచారం అందించే ఆకాశ నేత్రం. ఇలాంటి వ్యవస్థ నాశనం కావడమంటే పాక్‌ వైమానిక వ్యూహం అర్ధంతరంగా నిలిచిపోవడమే. పాకిస్థాన్‌ వద్ద మొత్తం 9 అవాక్స్‌ విమానాలున్నాయి.


అవాక్స్‌ ఏం చేస్తుంది..?

అవాక్స్‌ అంటే ఒక ఎగిరే రాడార్‌ స్టేషన్‌. దీన్ని విమానంపైన అమర్చుతారు. ఇది దూరం నుంచి వచ్చే వైమానిక, ఉపరితల దాడులను గుర్తిస్తుంది.

అవాక్స్‌లో ఉన్న ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు దాడి జరిగే ప్రమాదాన్ని గుర్తించి కమాండ్‌ సెంటర్లకు సమాచారం అందిస్తాయి.

శత్రువులు.. విమానాలు, డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినప్పుడు అవి గ్రౌండ్‌ స్టేషన్‌ రాడార్ల పరిధిలోకి ప్రవేశించకముందే అవాక్స్‌ గుర్తిస్తుంది.

360 డిగ్రీల మేరకు నిఘా చేయగల అవాక్స్‌ రాడార్‌ పరిధి 350 నుంచి 400 కిలోమీటర్లు.

అవాక్స్‌ను పర్యవేక్షించేందుకు, కమ్యూనికేషన్‌ చేసేందుకు 5-6 మంది ఆపరేటర్లు ఉంటారు. ఇది గాల్లో ఉన్నప్పుడు 20-25 లక్ష్యాలను పర్యవేక్షించి.. యుద్ధ విమానాలకు సూచనలు ఇవ్వగలదు.

అవాక్స్‌ వ్యవస్థలో సురక్షితమైన ఉపగ్రహ కమ్యూనికేషన్‌, ఎన్‌క్రిప్టెడ్‌ డేటా వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇది యుద్ధ విమానాలు, భూ ఆధారిత రాడార్లు, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, నౌకలకు సమాచారం అందిస్తుంది


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:29 AM