Ceasefire Agreement: ఒప్పందం జరిగినా మారని పాక్ బుద్ధి.. వరుసగా 3వ రోజు దాడులు
ABN, Publish Date - May 13 , 2025 | 07:11 AM
Ceasefire Agreement: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ నిత్యం తూట్లు పొడుస్తూనే ఉంది. నిన్న వరుసగా మూడవ రోజు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్, సాంబ జిల్లాలోకి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. వాటిని గుర్తించిన ఆర్మీ గాల్లోనే పేల్చేసింది.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంలో పాక్ తీవ్రంగా నష్టపోయింది. భారత ఆర్మీ పాకిస్తాన్‌లోని ఏయిర్‌బేస్‌లు, ఆర్మీ పోస్టులు, ఇతర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్‌కు చుక్కలు కనిపించాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదని పాక్ భావించింది. కాళ్ల బేరానికి వచ్చి.. అమెరికా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగేలా చేసుకుంది. మే 10వ తేదీన రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కింద యుద్ధాన్ని ఆపేశాయి. సోమవారం రెండు దేశాల ఆర్మీ అధికారులు సమావేశం అయ్యారు. కాల్పుల విరమణ గురించి చర్చించుకున్నారు.
అయితే, ఒప్పందం జరిగి యుద్ధం ఆగిన నాటి నుంచి ఇప్పటి వరకు పాక్ బుద్ధి ఏ మాత్రం మారలేదు. ఇండియాపై దాడులకు పాల్పడుతూనే ఉంది. ఒప్పందం జరిగిన గంటల్లోనే పాక్ ఆర్మీ రేంజర్లు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడ్డారు. ఒప్పందానికి తూట్లు పొడిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినా పాక్ ఆర్మీ వెనక్కు తగ్గటం లేదు. నిన్న వరుసగా మూడవ రోజు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్, సాంబ జిల్లాలోకి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. వాటిని గుర్తించిన ఆర్మీ గాల్లోనే పేల్చేసింది.
పాకిస్తాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో అధికారులు నిన్న సాంబ ఏరియాలో బ్లాక్ అవుట్ ప్రకటించారు. భారత ఆర్మీ పాకిస్తాన్ డ్రోన్లను పేల్చేసిన తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనూ అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలు లైట్లు పూర్తిగా ఆఫ్ చేసి ఇంట్లోనే ఉండాలని, కిటికీల దగ్గరకు అస్సలు రావద్దని హెచ్చరించారు. సైరన్ వేసి బ్లాక్ అవుట్‌కు పిలుపునిచ్చారు. ప్రజల సంరక్షణ కోసమే బ్లాక్ అవుట్ ప్రకటించినట్లు భయపడాల్సి అవసరం ఏమీ లేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Updated Date - May 13 , 2025 | 07:19 AM