ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pak Violates Ceasefire: సీజ్‌ఫైర్ గంటల్లోనే సీజ్.. పెద్దన్నయ్యకు ఝలక్

ABN, Publish Date - May 10 , 2025 | 09:29 PM

ఇది పెద్దన్నయ్య(డోనాల్డ్ ట్రంప్)కు శరాఘాతమనే చెప్పాలి. భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే మళ్లీ పాకిస్తాన్ తన నీచ..

Pakistan violates ceasefire

Pakistan violates ceasefire: భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే మళ్లీ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీంతో భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటోంది. భారత, పాకిస్థాన్ సరిహద్దు వెంబడి కొనసాగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనల నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన పాకిస్తాన్ నగరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ప్రతీకార దాడులు నిర్వహించింది. భారత ఆపరేషన్ సియాల్‌కోట్, నరోవాల్‌లోని సైనిక స్థావరాలతోపాటు పాకిస్తాన్‌లోని మూడు ముఖ్యమైన సైనిక వైమానిక స్థావరాలను తాకినట్లు సమాచారం.

ఈ దాడులలో ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులు, డ్రోన్‌లు ఉన్నాయని, ఫలితంగా కీలకమైన పాకిస్తాన్ వైమానిక ఆస్తులు ధ్వంసం అయ్యాయని ఇండియా చెబుతోంది. అయితే, దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ సైన్యం ఈ వాదనలను తిరస్కరించింది. ఈ దాడిలో ప్రాణనష్టం లేదా భౌతిక నష్టం జరగలేదని పేర్కొంది.

అటు, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘనని వీడియో సహా ధృవీకరించారు. పాక్ చేస్తున్న కాల్పులను, డ్రోన్ అటాక్స్ ను ఆయన వీడియో సహా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది పాకిస్థాన్ దురాగతానికి అద్ధం పడుతోంది.

ఇలా ఉండగా, పాకిస్తాన్ DGMO మధ్యాహ్నం 3.35 గంటలకు భారతదేశ DGMOకి ఫోన్ చేసింది. రాత్రి 7 గంటల నుండి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనను అమలులోకి తీసుకురావాలని ఇరుపక్షాలకు సూచనలు ఇవ్వబడ్డాయి. మే 12న మధ్యాహ్నం 12 గంటలకు డీజీఎంఓలు మళ్ళీ మాట్లాడుకుంటారని చెప్పి గంటల సమయం కాకముందే పాక్ మళ్లీ తన నీచపు బుద్ధిని చాటిచెబుతోంది. ఇది పెద్దన్నయ్య(డోనాల్డ్ ట్రంప్)కు శరాఘాతమనే చెప్పాలి.

Updated Date - May 10 , 2025 | 11:02 PM