ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: భారత్ సైనిక దాడులపై పాక్ రక్షణ మంత్రి ఏమన్నారంటే

ABN, Publish Date - May 07 , 2025 | 03:39 PM

ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలకు ఇరుదేశాలు ఆలోచన చేస్తున్నాయా అని అడిగినప్పుడు, అలాంటిదేమీ తన దృష్టికి రాలేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు.

న్యూఢిల్లీ: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైనిక దాడులు జరపడంపై ఆదేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) స్పందించారు. ఇండియాతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఉద్రిక్తతలను తగ్గించాలని ఇండియా అనుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పాకిస్థాన్ ఎలాంటి శత్రుత్వానికి చొరవ తీసుకోదని, రెచ్చగొడితే మాత్రం తగిన విధంగా స్పందిస్తుందని అన్నారు.

Operation Sindoor: ఇది గర్వించే సమయం... ఆపరేషన్‌ సిందూర్‌పై మోదీ


''ఇండియాకు వ్యతిరేకంగా పాక్ గత రెండు వారాలుగా ఎలాంటి శత్రుత్వ వైఖరి ప్రదర్శించకుండా నిలకడైన వైఖరితో ఉంది. అయితే మా మీద దాడికి దిగితే తగిన రీతిలో బదులిస్తాం. ఇండియాకు ఒక అడుగు వెనకి వేస్తే, మేము కూడా ఉద్రిక్తతలు తగ్గించేందుకు సన్నద్ధంగా ఉంటాం'' అని బ్లూమ్‌బర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలకు ఇరుదేశాలు ఆలోచన చేస్తున్నాయా అని అడిగినప్పుడు, అలాంటిదేమీ తన దృష్టికి రాలేదని ఆసిఫ్ చెప్పారు.


అప్పుడే అయిపోలేదు..

కాగా, 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలకమైన బుధవారంనాడు కీలకమైన హింట్ ఇచ్చారు. ''సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది'' (Abhi picture baki hai) అంటూ సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్‌లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపవచ్చని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఈ మిసైల్స్ గురించి తెలుసా

పాక్‌‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Read Latest and National News

Updated Date - May 07 , 2025 | 03:43 PM