ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shehbaz Sharif: ప్రతీకారం తీర్చుకుంటాం

ABN, First Publish Date - 2025-05-08T03:43:14+05:30

ఆపరేషన్‌ సిందూర్‌పై భారత్‌ను గట్టిగా హెచ్చరిస్తూ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ "ప్రతీకారం తప్పదు" అని స్పష్టం చేశారు. భారత దాడులను యుద్ధ చర్యగా అభివర్ణించిన షరీఫ్‌.. ఐదు యుద్ధవిమానాలు, రెండు డ్రోన్లను తమ వాయుసేన కూల్చిందని తెలిపారు, కానీ ఆధారాలు చూపలేదు.

భారత్‌ తప్పునకు పర్యవసానాలుంటాయి

పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలు

భారత్‌ జరిపిన దాడులకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. భారత్‌ చేసిన తప్పునకు పర్యవసానాలు తప్పక ఉంటాయి. భారత్‌ చేసిన దాడులను పాకిస్థాన్‌ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. రాఫెల్‌ జెట్‌తో సహా ఐదు యుద్ధవిమానాలు, రెండు డ్రోన్లను నేలకూల్చింది.

- పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్‌, మే 7: తమ దేశంలోని పలు ప్రాంతాలపై భారత్‌ జరిపిన దాడులకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు! భారతదేశం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో బుధవారం రాత్రి పొద్దుపోయాక.. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘భారత్‌ చేసిన తప్పునకు పర్యవసానాలు తప్పక ఉంటాయి’ అని హెచ్చరించారు. ‘‘క్షిపణిదాడులకు భయపడి పాకిస్థాన్‌ కుంగిపోతుందని, ఓడిపోయినట్టు ఒప్పుకొంటుందని భారత్‌ అనుకుంటోంది. కానీ.. ఇది తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎలా పోరాడాలో తెలిసిన దేశం అని మర్చిపోతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. బుధవారం ఉదయం పార్లమెంటులో మాట్లాడిన ఆయన భారత్‌ దాడులను యుద్ధచర్యతో సమానంగా అభివర్ణించారు. భారత్‌ చేసిన దాడులను పాకిస్థాన్‌ వాయుసేన సమర్థంగా ఎదుర్కొందని.. రఫెల్‌ జెట్‌తో సహా ఐదు యుద్ధవిమానాలు, రెండు డ్రోన్లను కూడా నేలకూల్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలనూ పాక్‌ ప్రధాని సమర్పించలేదు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ సైనిక బలగాలను అభినందించిన ఆయన.. దేశ రక్షణకు పాక్‌ సాయుధ దళాలు అహరహం శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా.. భారత దాడులకు ప్రతిగా తగిన చర్యలు తీసుకునే అధికారాన్ని తమ సాయుధదళాలకు ఇచ్చినట్టుగా పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయాన్ని ఉటంకిస్తూ రాయ్‌టర్స్‌ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - 2025-05-08T03:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising