ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Plot: పాక్‌లో పహల్గాం సూత్రధారులు

ABN, Publish Date - Apr 25 , 2025 | 03:24 AM

పాకిస్థాన్‌లోని సూత్రధారులు రియల్‌-టైమ్‌ ఇంటెలిజెన్స్‌తో పహల్గాం ఉగ్రదాడిని నిర్వహించగా, కరాచీ, ముజఫరాబాద్‌లలో డిజిటల్‌ ఆధారాలు గుర్తించారు. నలుగురు నుంచి ఆరుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 : పాకిస్థాన్‌లో సూత్రధారులు కూర్చొని కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిని జరిపించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పహల్గాం దాడి జరుగుతున్నంతసేపూ ఆ సూత్రధారులకు, ఉగ్రవాదులకు మధ్య రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌ సంబంధాలు కొనసాగినట్టు కనుగొన్నారు. ప్రాథమికంగా తమ దర్యాప్తులో తేలిన అంశాలు, దొరికిన ఆధారాలు, రికార్డు చేసిన సంభాషణలను బట్టి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. పాకిస్థాన్‌లోని కరాచీ, ముజఫరాబాద్‌ల్లో దీనికి సంబంధించిన డిజిటల్‌ మూలాలను పసిగట్టినట్టు ఓ ఇంగ్లీష్‌ న్యూస్‌ వెబ్‌పోర్టల్‌ కథనం పోస్టుచేసింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదుగానీ వారు నలుగురు నుంచి ఆరుగురి వరకు ఉండొచ్చునని, వారంతా పాకిస్థానీయులని, అందరూ ఉర్దూ మాట్లాడారని పోలీసులు చెబుతున్నారు. అంతర్గత నిఘా సమాచారం, స్థానికుల మాటలను బట్టి వారు ఈ నిర్ధారణకు వచ్చారని ఆ కథనం తెలిపింది. ఇంకా.. ఈ కథనాన్ని అనుసరించి, దాడిలో పాల్గొన్నవారిలో ఆదిల్‌ హుస్సేన్‌, ఆసిఫ్‌ షేక్‌లను అనంత్‌నాగ్‌లో కొద్దిరోజులుగా చూస్తున్నామని స్థానికులు తెలిపారు. 2018లో పాకిస్థాన్‌కు వెళ్లిన ఆదిల్‌ ఈ ఏడాదే తిరిగి వచ్చాడని ఇంటెలిజెన్స్‌ నివేదికలు తెలుపుతున్నాయి.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 03:24 AM