ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Vs Pakistan: కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్థాన్

ABN, Publish Date - Apr 24 , 2025 | 01:33 PM

India Vs Pakistan: భారత్‌పై దాయాది దేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులోభాగంగా క్షిపణి పరీక్షలకు సిద్దమవుతోంది. కరాచీ తీరంలోని ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత్‌పై దాయాది దేశం పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులోభాగంగా క్షిపణి పరీక్షలకు సిద్దమవుతోంది. కరాచీ తీరంలోని ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. తమ దేశంలోని ప్రత్యేక ఆర్థిక ప్రాంతంలో ఈ క్షిపణి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ క్షిపణి ప్రయోగంతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో క్షిపణి ప్రయోగంపై పాకిస్థాన్ ఈ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ అనుసరిస్తున్న ఈ తరహా చర్యలను భారత రక్షణ సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఆ క్రమంలో పాకిస్థాన్ క్షిపణి పరీక్షలపై భారత రక్షణ శాఖతోపాటు నిఘా వర్గాలు దృష్టి సారించాయి.


పాకిస్థాన్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్స్ (MIRV) సామర్థ్యాలను పరీక్షించడంలో భాగంగా ఈ క్షిపణులను పరీక్షించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ..అవసరమైన చర్యలు తీసుకుంటామంటున్న భారత్‌లోని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించడంతో.. పాకిస్థాన్ అప్రమత్తమైంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర మూకలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.ఎందుకంటే.. మరోసారి సదరు ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపే అవకాశముందని పాక్ భావించింది. ఇంకోవైపు పాక్ ఉగ్రదాడి చేయడంతో.. ఆ దేశంపై భారత్ తన కఠిన వైఖరిని అవలంబించింది.


అందులోభాగంగా సింధు నదీ జలాలను నిలిపివేసింది. దేశంలోని ఆ దేశపు రాయబారిని దేశం విడిచి వెళ్లాలంటూ సమన్లు జారీ చేసింది. అలాగే అట్టారి , వాఘ సరిహద్దుల వద్ద రాకపోకలను నిలిపివేసింది. ఈ తరహా చర్యలు చేపట్టడంతో.. పాకిస్థాన్ మరోసారి తన దుందుడుకుతనాన్ని వ్యక్తం చేసే అవకాశముందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: పర్యటన రద్దు చేసుకొన్న రాహుల్.. ఎందుకంటే..

Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..

Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి

Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

For National news And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 02:12 PM