ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indus Waters Treaty: సింధు జలాలపై మేమేం చేయలేం

ABN, Publish Date - May 10 , 2025 | 04:46 AM

పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయకుండా నిలిపివేసింది. ప్రపంచ బ్యాంకు జోక్యం చేయాలని పాక్‌ కోరినా, తాము సహాయకులమని తప్ప మరో పాత్రలేదని బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా స్పష్టం చేశారు.

కేవలం సహాయకులం మాత్రమే: ప్రపంచ బ్యాంకు చీఫ్‌

పాక్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ, మే 9: సింధు జలాల విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అష్టదిగ్బంధనం చేసిన భారత ప్రభుత్వం కీలకమైన సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లి.. భారత్‌ను బూచిగా చూపించే ప్రయత్నం చేసిన దాయాది దేశానికి భారీ షాక్‌ తగిలింది. ముఖ్యంగా సింధు జలాల విషయంలో ఇరు దేశాలకు మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు ఈ విషయంలో జోక్యం చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. శుక్రవారం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా స్పందిస్తూ.. సింధు జలాల ఒప్పందంపై తామేమీ చేయలేమని తేల్చి చెప్పారు. తాము కేవలం సహాయకులుగా మాత్రమే ఉంటామన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి పాత్రనూ పోషించలేమని స్పష్టం చేశారు. ‘‘సింధు జలాల విషయంలో ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే అంశంపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. కానీ, ఇవన్నీ ఊహాజనితాలు. దీనిలో మా పాత్ర ఏమీ ఉండదు. కేవలం సహాయకులం మాత్రమే.’’ అని అజయ్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:46 AM