Rahul Gandhi: పర్యటన రద్దు చేసుకొన్న రాహుల్.. ఎందుకంటే..
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:12 PM
Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో గురువారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆ పార్టీలోని అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉగ్రదాడిని ఆ పార్టీ ఖండించనుంది. అలాగే ఈ ఘటనపై తీర్మానం చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పించి.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించనున్నారు.
అసలు అయితే రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనకు వెళ్లవలసి ఉంది. కానీ ఆయన ఈ పర్యటనను సైతం రద్దు చేసుకొని.. ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. మరోవైపు బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరగనుంది. ఆ క్రమంలో ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఈ ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చించే అవకాశం ఉందని సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర అబ్దుల్లాతోపాటు ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా మాట్లాడి.. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను వారు ఆరా తీసిన సంగతి తెలిసిందే. అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.
ఈ దాడి జరిగిన రోజే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే స్పందించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరు జరపడానికి తాము సైతం మద్దతు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ఇంతకీ సింధు నదీ జలాలు ఒప్పందం ఎప్పుడు.. ఎందుకు జరిగిందో తెలుసా..
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
Honeymoon Couple: హనీమూన్‌కు వెళ్లిన జంట.. కాల్పులకు ముందు ఏం చేశారంటే..
Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు
Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
For National news And Telugu News
Updated Date - Apr 24 , 2025 | 01:19 PM