Pahalgam Attackers In Pir Panjal: పిర్ పంజల్ పర్వతశ్రేణుల్లో దాగున్న పహెల్గామ్ ఉగ్రవాదులు.. నిఘా వర్గాలు అంచనా
ABN, Publish Date - Apr 25 , 2025 | 09:27 AM
పహల్గామ్‌లో అమాయకులను బలితీసుకున్న నలుగురు ఉగ్రవాదులు పరి పంజల్ పర్వత శ్రేణిలో దాక్కున్నట్టు నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి.
పహెల్గామ్‌లో అమాయక టూరిస్టులను బలితీసుకున్న ఘటనలో ప్రధాన నిందితుడు, పాకిస్థానీ జాతీయుడైన హశీమ్ మూలా (సులేమాన్) పిర్ పంజల్ పర్వతాల్లో దాక్కున్నట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. గత ఏడాదిగా అతడు జమ్మూ కశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉంటూ భద్రతా దళాలు, స్థానికేతరులపై జరిగిన కొన్ని దాడుల్లో పాలుపంచుకున్నాడట.
పిర్ పంజల్ పర్వత శ్రేణుల ఎగువ ప్రాంతాల్లో మూసా మరో నలుగురు ఉగ్రవాదులతో కలిసి తలదాచుకున్నట్టు నిఘా వర్గాల అంచనా. వీరందరూ మంగళవారం నాటి దాడిలో పాలుపంచుకున్నారు. వీరిని ఇప్పటికే జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన అలా భాయ్ అలియాస్ తల్హా, ఆసిఫ్ ఫౌజీ (పాకిస్థానీ), అదిల్ హుస్సెయిన్ థోకర్ (అనంత్‌నాగ్ జిల్లా వాస్తవ్యుడు), ఎహ్‌సాన్ (పుల్వామా వాస్తవ్యుడు) పిర్‌పంజ్ పర్వత శ్రేణుల్లో దాక్కున్నట్టు అధికారులు గుర్తించారు. పాక్ కేంద్రంగా కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రమూకలతో మూసా టచ్‌లో ఉన్నాడు.
ఈ మారణహోమంపై లోతైన దర్యాప్తు చేస్తున్న నిఘా వర్గాలు.. ఉగ్రవాదులకు ఎవరెవరి నుంచి సాయం అందిందనే కోణంలో విస్తృత దర్యాప్తు చేస్తున్నాయి. ఎల్‌ఈటీ మద్దతుదారులే గత ఏడాదిగా ఉగ్రవాదులను సరిహద్దు జిల్లాల మీదుగా కశ్మీర్‌లోకి చొప్పించి ఉంటారని తాము భావిస్తు్న్నట్టు ఓ అధికారి తెలిపారు. ఉగ్రవాదులపై పూర్తి సమాచారం కోసం నిఘా వర్గాలు ఆన్‌లైన్ వేదికలపై కూడా దృష్టి పెట్టాయి. ఎల్‌ఈటీ, దాని అనుబంధన వర్గాలతో కశ్మీర్‌లోని ఎవరెవరు టచ్‌లో ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకు్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల్ ద్వారా దాడులను ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి స్థానికులతో పాటు ఉగ్రవాదుల తరలింపులో సాయమందించినట్టు అనుమానాలు ఉన్న వారిని ప్రశ్నిస్తున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 200 మంది మాజీ మిలిటెంట్లు, పాక్ ప్రేరేపిత్ ఉగ్రసంస్థల మద్దతుదారులను నిఘా వర్గాలు ప్రశ్నించాయి. ప్రథామిక విచారణ అనంతరం కొందరిని విడిచిపెట్టగా మరికొందరిని మాత్రం నిఘా వర్గాలు ఇంకా విచారిస్తున్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20 లక్షల నజరానా ఇస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదిల్ హుస్సేన్ థోకర్ 2018లో పాక్‌కు వెళ్లాడు. గతేడాదే మళ్లీ తిరిగొచ్చాడు. ఇక దాడిలో పాల్గొన్న పాక్ జాతీయులు ఇద్దరూ గత రెండేళ్లుగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. అయితే, నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఇప్పటికే ఉగ్రవాద నిరోధక చర్యటలను పటిష్టంగా చేపడుతున్నాయి. ఎల్‌ఈటీకి అనుబంధంగా పనిచేస్తున్న పలు ఉగ్రంస్థలపై ఇటీవల కాలంలో ఉక్కుపాదం మోపాయి.
ఇవి కూడా చదవండి:
భారత్‌లో పాక్ ట్విట్టర్ అకౌంట్‌పై వేటు
పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా అధికారి తీవ్ర ఆగ్రహం
న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు
Updated Date - May 19 , 2025 | 11:42 PM