Share News

Ex-US Official Slams Pak: పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Apr 24 , 2025 | 10:01 AM

పహాల్గమ్ దాడిలో పాక్ హస్తంపై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పాక్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా తక్షణం ప్రకటించాలని అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు ఓసామా బిన్ లాడెన్‌కు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించారు.

Ex-US Official Slams Pak: పాక్ ఆర్మీ చీఫ్ బిన్ లాడెన్ లాంటోడు.. కశ్మీర్ దాడిపై అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం
Pak Army Chief

ఇంటర్నెట్ డెస్క్: పహల్గామ్ దాడిలో పాక్ పాత్రపై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు అల్ కయిదా ఉగ్రవాది ఓసామా బిన్‌ లాడెన్‌కు పెద్దగా తేడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరు పాలెస్‌లో ఉంటే మరొకరు గుహల్లో జీవించారని, వారి మధ్య తేడా ఇదొక్కటేనని అన్నారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాదం ఎగదోసే దేశంగా, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించాలని అన్నారు.

పహల్గామ్ దాడి అకస్మాత్తుగా జరిగినది ఎంతమాత్రం కాదని మైఖేల్ రూబెన్ స్పష్టం చేశారు. ఈ దాడికి మరేరకంగా నిర్వహించినా వాస్తవాన్ని మరుగున పరిచే ప్రయత్నం చేసినట్టేనని అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ దాడి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బిల్ క్లింటన్ పర్యటన సందర్భంగా ఇదే తరహా దాడి జరగిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు.


మంగళవారం నాటి పహల్గామ్ దాడిలో మృతదేహాలు స్వస్థలాలకు చేర్చారు. దీంతో, ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీరు చూసి స్థానికులు కదిలిపోయారు. ఇదిలా ఉంటే, దాడి నేపథ్యంలో భారత్‌పై పలు కఠిన చర్యలు తీసుకుంది. భారత్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న మిలిటరీ సలహాదారులందరినీ కేంద్ర ప్రభుత్వం వారం లోపు దేశాన్ని వీడాలని ఆదేశించింది. అంతేకాకుండా, సింధు నదీ జలాల ఒప్పందం అమలును కూడా నిలిపివేసింది.


సార్క్ వీసా మినహాయింపు పథకం కింద ఇకపై పాకిస్థానీలు భారత్‌లో పర్యటించలేరని అన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద భారత్‌కు వచ్చిన వారు 48 గంటల్లో దేశాన్ని వీడాలని కూడా ఆదేశించారు. ఇక ఉగ్రదాడుల ప్రభావం కశ్మీర్ పర్యాటకంపై భారీగా పడింది. వివిధ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో కశ్మీర్‌ను వీడుతున్నారు. ఇక ఉగ్రదాడికి నిరసనగా జమ్మూకశ్మీర్ఋ‌లో బంద్ పాటించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత బంద్ పాటించడం ఇదే తొలిసారి. ఇక పహల్గామ్ దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అమాయక పౌరులను కాల్చి చంపడం అమానవీయ, అనాగరిక చర్య అని మండిపడ్డాయి.

ఇవి కూడా చదవండి:

న్యాయమూర్తులపై మహిళ సంచలన వ్యాఖ్య.. షాకిచ్చిన కోర్టు

రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు

Read Latest and National News

Updated Date - May 19 , 2025 | 11:33 PM