ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

P Chidambaram: ఎండదెబ్బకు సొమ్మసిల్లిన చిదంబరం... ఆసుపత్రికి తరలింపు

ABN, Publish Date - Apr 08 , 2025 | 09:33 PM

అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు చిదంబరం వచ్చారు. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనా సమావేశానికి ఆయన హాజరయినప్పుడు వడదెబ్బ తగిలింది.

అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) మంగళవారంనాడు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం వద్ద ఎండదెబ్బకు సొమ్మసిల్లడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు చిదంబరం వచ్చారు. సబర్మతి ఆశ్రమం వద్ద ప్రార్థనా సమావేశానికి ఆయన హాజరయినప్పుడు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయనను కార్యకర్తలు వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.


నాన్నగారు క్షేమం: కార్తీ

కాగా, తన తండ్రి క్షేమంగా ఉన్నారని, వైద్యులు పరీక్షలు నిర్వహించారని చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఒక ట్వీట్‌లో తెలిపారు. వడదెబ్బ, డీహైడ్రేషన్‌‌ కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ప్రస్తుతం అంతా సజావుగానే ఉందని చెప్పారు. దీనికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్‌లో జరిగి సీడబ్ల్యూసీ సమావేశంలో చిదంబరం పాల్గొ్న్నారు.

Updated Date - Apr 08 , 2025 | 09:41 PM