ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Asaduddin Owaisi: సడక్‌చాప్ ఆద్మీలా మాట్లాడుతున్న పాక్ ఆర్మీ చీఫ్.. మండిపడిన ఒవైసీ

ABN, Publish Date - Aug 12 , 2025 | 03:40 PM

భారతదేశానికి వ్యతిరేకం ఆసిమ్ మునిర్ తాజాగా 'అణు' వ్యాఖ్యలు చేశారు. తమది అణ్వస్త్ర దేశమని, తమ దేశ ఉనికికి ముప్పు వచ్చిన పక్షంలో తమతో పాటు సగం ప్రపంచం అంతమైపోతుందని ప్రేలాపన చేశారు.

Asaduddin owaisi, Pak Army Chief Asim Munir

న్యూఢిల్లీ: అమెరికా వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ (Asim Munir) 'అణు' హెచ్చరికలు చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవని అన్నారు. ఆయన ఒక 'సడక్ చాప్ ఆద్మీ' (ఆవారా)లా మాట్లాడుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు.

'పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ వాఖ్యలు, బెదిరింపులు ఖండించదగినవి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయన మన వ్యూహాత్మాక భాగస్వామి అయిన అమెరికా వేదిక నుంచి ఈ మాటలు మాట్లాడటం. ఆయన 'సడక్‌చాప్ ఆద్మీ'లా మాట్లాడుతున్నాడు. పాకిస్థాన్ ఆర్మీ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతుండటం, వారి మానసిక స్థితిని మనం గ్రహించాలి. ఈ క్రమంలో భారతదేశం సిద్ధంగా ఉండటానికి మన రక్షణ బడ్జెట్‌ను పెంచాల్సి ఉంటుంది' అని ఒవైసీ అన్నారు.

భారతదేశానికి వ్యతిరేకంగా ఆసిమ్ మునిర్ తాజాగా 'అణు' వ్యాఖ్యలు చేశారు. తమది అణ్వస్త్ర దేశమని, తమ దేశ ఉనికికి ముప్పు వచ్చిన పక్షంలో తమతో పాటు సగం ప్రపంచం అంతమైపోతుందని ప్రేలాపన చేశారు. ఆసిమ్ మునీర్ హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ సైతం ఘాటుగా స్పందించింది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అంతర్జాతీయ సమాజం అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. అమెరికాకు మద్దతు ఇచ్చినప్పుడల్లా భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్‌కు అలవాటేనని దుయ్యబట్టింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీనిని బట్టే స్పష్టమవుతోందని మునీర్ వ్యాఖ్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.

ఇవి కూడా చదవండి..

జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్

తిక్క రేగిందంటే బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపిస్తాం.. బిలావల్‌కు మిథున్ చక్రవర్తి వార్నింగ్

For More National News and Telugu News

Updated Date - Aug 12 , 2025 | 05:59 PM