ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Puri Rath Yatra: జగన్నాథుని రథయాత్రలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు

ABN, Publish Date - Jun 28 , 2025 | 07:31 AM

ఒడిశాలోని పూరిలో శుక్రవారం నాడు ప్రతిష్ఠాత్మకంగా మొదలైన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra)లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరుకాగా, శోభాయాత్రలో 500 మందికిపైగా గాయపడ్డారు.

Puri Rath Yatra 2025

ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర (Puri Rath Yatra) నిన్న (జూన్ 27న) ఘనంగా ప్రారంభమైంది. దీంతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. శుక్రవారం ఉదయం జగన్నాథుడు, దేవత సుభద్ర, బలభద్రుడి చెక్క విగ్రహాలను ఆలయం నుంచి రథాలపైకి ఎక్కించారు. ఆ తర్వాత రథాలను లాగడం ప్రారంభించారు. సాయంత్రం 4:08 గంటలకు బలభద్రుని తలధ్వజ రథం మొదట బయలుదేరింది. తర్వాత సుభద్ర దేవి దర్పదలన్ రథం, చివరకు జగన్నాథుని నంది ఘోష రథం బయలుదేరాయి.

ఈ సమయంలో భక్తుల నినాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. అదే క్రమంలో ప్రభువు బల భద్రుల రథాలను శ్రీగుండిచా ఆలయం వైపు లాగే క్రమంలో 500 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. పెరిగిన వేడి నేపథ్యంలో పలువురు భక్తులు మూర్ఛపోయారని, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని ఒడిశా ఆరోగ్య మంత్రి ముఖేష్ మహాలింగ్ తెలిపారు.

10 వేల మందితో..

ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. గ్లూకోజ్, నీరు తగినంత పరిమాణంలో అందించామని ఆరోగ్య మంత్రి ముఖేష్ తెలిపారు. అనారోగ్యానికి గురైన వారి సంఖ్య ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్కడికక్కడే నడిచిన అంబులెన్సుల ప్రకారం 500 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ వేడుక భద్రత కోసం ఒడిశా పోలీసులతోపాటు కేంద్ర బలగాలు, ఎన్‌ఎస్‌జీ సహా దాదాపు 10,000 మంది సిబ్బందిని కేటాయించారు. దీంతో పాటు 275కి పైగా సీసీటీవీలను కూడా పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు.

రథయాత్ర ఎంత దూరం..

పూరిలోని ప్రసిద్ధ 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర 2.6 కి.మీ దూరంలో ఉన్న శ్రీ గుండిచా ఆలయానికి చేరడంతో పూర్తవుతుంది. ఈ రథయాత్రలో ఒడిశా గవర్నర్ హరి బాబు కంభంపతి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్ర సింగ్ షెఖావత్, పూరి ఎంపీ సంబిత్ పాత్ర సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. గోవర్ధన్ పీఠానికి చెందిన 81 ఏళ్ల శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వీల్‌చైర్‌పై రథాలను లాగే కార్యక్రమం చూసేందుకు వచ్చారు. ఈ సంవత్సరం రథయాత్రలో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు


జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 08:25 AM