Operation Sindoor: త్రివిధ సైన్యాధిపతులతో రక్షణ మంత్రి సమావేశం.. దేనికైనా సిద్ధం అంటూ...
ABN, Publish Date - May 09 , 2025 | 02:04 PM
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపధ్యంలో త్రివిధ సైన్యాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. జాతీయ భద్రతా పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. మారుతున్న భద్రతా పరిస్థితికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గురువారం రాత్రి ఎల్‌ఓసీతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇదిలా ఉంటే త్రివిధ సైన్యాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. జాతీయ భద్రతా పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. మారుతున్న భద్రతా పరిస్థితికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఆ తరువాత పరిస్థితిపై రక్షణ మంత్రితో ముగ్గురు సైన్యాధిపతులు, CDS జనరల్ అనిల్ చౌహాన్ సమావేశం అయ్యారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత సైనిక నాయకత్వంతో సమావేశం నిర్వహించి, జాతీయ భద్రతా పరిస్థితిని తెలుసుకున్నారు. మారుతున్న భద్రతా పరిస్థితికి సంబంధించిన ప్రతి అంశాన్ని సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ. పి. సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి సమావేవంలో చర్చించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిన తర్వాత, రక్షణ మంత్రిత్వ శాఖ.. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, తన ప్రజలను రక్షించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొంది.
Also Read:
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు
Updated Date - May 09 , 2025 | 02:33 PM