ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kashmir terror attack: ఉగ్రవాద అంతానికి ఇది ఆరంభం కావాలి

ABN, Publish Date - May 08 , 2025 | 04:35 AM

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబ సభ్యులు ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతు తెలిపారు. ఉగ్రవాదానికి ముగింపు కావాలంటూ వారు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షి

దేశంలో ఉగ్రవాదం అంతానికి ఇది ప్రారంభం కావాలని లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ భార్య హిమాన్షి నర్వాల్‌ అభిప్రాయపడ్డారు. పెళ్లైన మూడు వారాలకే భార్య హిమాన్షితో కలిసి హనీమూన్‌ నిమిత్తం లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ పహల్గాంకు వెళ్లి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. ‘శాంతిని, అమాయక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నా భర్త సైనిక దళాల్లో చేరారు. దేశంలో ఉగ్రవాదం, విద్వేషం ఉండకూడదని ఆయన కోరుకున్నారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఆపరేషన్‌ను ముగించొద్దని ప్రధాని మోదీని కోరుతున్నా’ అని హిమాన్షి అన్నారు.

నా కొడుకు త్యాగం వృథా కాలేదు మృతుడు మంజునాథ్‌ రావ్‌ తల్లి సుమతి

తన కుమారుడి త్యాగం వృథా కాలేదని కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్‌ రావ్‌ తల్లి సుమతి సంతృప్తి వ్యక్తం చేశారు. మధుసూదన్‌ రావ్‌ తన భార్య పల్లవి, కుమారుడు అభిజేయతో కలిసి పహల్గాంకు వెళ్లి ఉగ్రదాడిలో మరణించారు. ‘అమాయకులకు హాని జరుగకూడదు. అయితే, మాకు హాని కలిగించిన ముష్కరులను వదిలిపెట్టకూడదు. నా కుమారుడి త్యాగం వృథా కాకూడదు. సరైన నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నా’ అని అన్నారు.


సైన్యం చర్య భేష్‌ మృతుడు భరత్‌ తండ్రి చిన్నవీరప్ప

సైన్యం చర్యను మరో మృతుడు భరత్‌ భూషణ్‌ తండ్రి చిన్నవీరప్ప ప్రశంసించారు. బెంగళూరుకు చెందిన భరత్‌భూషన్‌ తన భార్య, మూడేళ్ల కుమారుడితో పహల్గాం పర్యటనకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌ అనేది సరైన పేరు. ఎందుకంటే అనేక మంది మహిళల తిలకాన్ని ఉగ్రవాదులు చెరిపేశారు. ప్రభుత్వం మంచిపని చేసింది’ అని చిన్నవీరప్ప పేర్కొన్నారు.

ఆ నలుగురినీ చంపేయాలి సుశీల్‌ నతానియేల్‌ భార్య జెన్నీఫర్‌

పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులనూ అంతం చేయాలని ఇండోర్‌కు చెందిన సుశీల్‌ నతానియేల్‌ భార్య జెన్నీఫర్‌ డిమాండ్‌ చేశారు. భార్యతో కలిసి పహల్గాంకు వెళ్లిన సుశీల్‌ నతానియేల్‌ కూడా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ‘ఇప్పుడు జరిపిన క్షిపణి దాడి సరైనదే. కానీ, ఆ నలుగురు ఉగ్రవాదులనూ అంతమొందించాలి. ఎందుకంటే ఆ నలుగురూ జంతువుల కంటే దారుణంగా ప్రవర్తించారు. వారికీ ఇలాంటి శిక్షే పడాలి. ఆ నలుగురూ చావాల్సిందే’ అని జెన్నీఫర్‌ పేర్కొన్నారు.

ఇంతకు మించిన జవాబుండదు ఎన్‌.రామచంద్రన్‌ కుమార్తె ఆర్తి

మృతుల కుటుంబాలకు ఈ ఆపరేషన్‌తో కొంత ఉపశమనం కలిగిందని కేరళలోని కోచికి చెందిన ఎన్‌.రామచంద్రన్‌ కుమార్తె ఆర్తి పేర్కొన్నారు. ఆర్తి ఎదురుగానే ఆమె తండ్రిని ఉగ్రవాదులు హతమార్చారు. ‘ఉగ్రవాదానికి ఇంతకు మించిన సమాధానం మరొకటి ఉండదు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులందరికీ నా సెల్యూట్‌, ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని ఆర్తి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:35 AM