ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: రష్యాపై డ్రోన్ల దాడులు.. మాస్కోలో ఆపరేషన్ సిందూర్ టీమ్‌కు విచిత్ర అనుభవం

ABN, Publish Date - May 25 , 2025 | 07:35 PM

ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.

Operation Sindoor Delegation In Moscow

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు (Drone attack) దిగిన కారణంగా మాస్కో (Moscow) విమానాశ్రయాన్ని మూసి వేయడంతో కనిమొళి బృందం ప్రయాణిస్తున్న విమానం 45 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది.


డీఎంకే ఎంపీ అయిన కనిమొళి బృందంలో ఎన్సీపీ ఎంపీ జావేద్ అష్రఫ్, ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్, ఆర్జేడీ ఎంపీ ప్రెద్ చంద్ గుప్తా, బీజేపీ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌక్, ఎన్సీపీ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్, మాజీ రాయబారి మంజీవ్ సింగ్ పూరి ఉన్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల గురించి వివరించేందుకు వెళ్తున్న బృందానికి యుద్ధ పరిస్థితులు ఎదురుకావడం విచిత్రం. కాసేపు గందరగోళం నెలకొంది. అయితే బలమైన సందేశాన్ని అందించేందుకు వెళ్తున్న బృందాన్ని డ్రోన్లతో నిండిన ఆకాశం అడ్డుకోలేకపోయింది.


కాగా, ఉక్రెయిన్, రష్యా దేశాలు ఒకవైపు యుద్ధ ఖైదీల మార్పిడి చేసుకుంటూనే మరోవైపు దాడులకు కూడా తెగబడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని 30 నగరాలు, గ్రామాలపై రష్యా దాడులకు తెగబడినట్టు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రకటించారు. ఇరు దేశాలు డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకోవాలని జెలెన్ స్కీ అభ్యర్థిస్తున్నారు.

ఇవీ చదవండి:

Gold Rates on May 25: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 07:35 PM