Operation Sindoor: యూనీఫామ్ లేని యుద్ధ వీరుడు.. ఆపరేషన్ సిందూర్‌లో జవాన్లకు సాయం..
ABN, Publish Date - May 29 , 2025 | 04:18 PM
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం సమయంలో భారత సైనికులు పంజాబ్, ఫిరోజాపూర్ జిల్లాలోని పలు గ్రామ పొలాల్లో క్యాంపులు వేశారు. శత్రు దేశానికి తగిన విధంగా సమాధానం చెబుతూ ఉన్నారు. శ్రవణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు తమ పొలంలో ఉన్న జవాన్ల క్యాంపు దగ్గరకు వెళ్లాడు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. తమ దేశంలోకి వచ్చి మరీ ఉగ్రస్థావరాలపై దాడి చేయటంతో పాకిస్థాన్ రెచ్చిపోయింది. భారత్‌పై యుద్ధానికి కాలు దువ్వింది. సరిహద్దు ప్రాంతాలపై మిస్సైల్స్, డ్రోన్ దాడులు చేసింది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ కూడా సరిహద్దుల దగ్గర కాల్పులకు తెగబడింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సేనలతో పోరాడుతున్న జవాన్ల దగ్గరకు ఓ పిల్లాడు వెళ్లాడు. వారికి తన వంతు సాయం చేశాడు. ఇంతకీ ఆ బాలుడు చేసిన సాయం ఏంటో తెలియాలంటే.. ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. భారత్, పాక్ యుద్ధం సమయంలో భారత సైనికులు పంజాబ్, ఫిరోజాపూర్ జిల్లాలోని పలు గ్రామ పొలాల్లో క్యాంపులు వేశారు. శత్రు దేశానికి తగిన విధంగా సమాధానం చెబుతూ ఉన్నారు. శ్రవణ్ సింగ్ అనే 10 ఏళ్ల బాలుడు తమ పొలంలో ఉన్న జవాన్ల క్యాంపు దగ్గరకు వెళ్లాడు.
అది కూడా జవాన్ల కోసం నీళ్లు, పాలు, లస్సీ తీసుకుని వెళ్లాడు. అలా ఒక్కసారి మాత్రమే కాదు.. చాలా సార్లు తీసుకుని వెళ్లాడు. ఆ వయసులోని పిల్లలు గట్టిగా శబ్ధం వినపడితేనే భయపడతారు. అలాంటిది శ్రవణ్ సింగ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా జవాన్లకు సాయం చేశాడు. అతడి ధైర్య సాహసాలు, చేసిన సాయాలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మన్రల్.. శ్రవణ్ సింగ్‌ను పిలిపించి సత్కరించాడు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. ‘ నేను భయపడలేదు. నేను పెద్దవాడినయ్యాక సైనికుడు అవ్వాలని అనుకుంటున్నాను. నేను సైనికుల కోసం నీళ్లు, లస్సీ, పాలు, ఐస్ క్రీములు తీసుకెళ్లేవాడిని. వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారు’ అని అన్నాడు. ఇక, శ్రవణ్ గురించి తెలుసుకుంటున్న వారు అతడ్ని ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Viral Video: పుట్‌పాత్‌పై యువకుడ్ని చావగొట్టిన ముగ్గురు యువతులు..
Elephant Viral Video: నదిలో పడిపోయిన కారు.. బయటకు లాక్కొచ్చిన ఏనుగు..
Updated Date - May 29 , 2025 | 06:34 PM