Viral Video: పుట్‌పాత్‌పై యువకుడ్ని చావగొట్టిన ముగ్గురు యువతులు..
ABN , Publish Date - May 29 , 2025 | 03:36 PM
Viral Video: బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతడ్ని ఎగిరి కాలితో తన్నింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతడి జట్టు పట్టుకుని తలను గోడకు కొట్టింది. కుడి చేత్తో చెంపను చెళ్లుమనిపించింది.
సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఘోరాలకు లెక్కలేదు. కొందరు కామాంధులు చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు తేడా లేకుండా అందరిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సమాజంలో అమాయకంగా కనిపించే ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తించే మగాళ్లు కోకొల్లలు. తక్కువ శాతం మంది ఆడవాళ్లు మాత్రమే తమతో తప్పుగా ప్రవర్తించే వారికి సరైన విధంగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా తమతో తప్పుగా ప్రవర్తించిన ఓ యువకుడికి ముగ్గురు యువతులు కఠిన పద్దతిలో బుద్ధి చెప్పారు. నడిరోడ్డుపై నలుగురూ చూస్తుండగా అతి దారుణంగా అతడిపై దాడి చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఘర్ కే కలేష్’ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఓ ముగ్గురు యువతులు ఓ యువకుడ్ని చుట్టుముట్టారు. అతడిపై దాడి చేస్తూ ఉన్నారు. బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతడ్ని ఎగిరి కాలితో తన్నింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అతడి జట్టు పట్టుకుని తలను గోడకు కొట్టింది. కుడి చేత్తో చెంపను చెళ్లుమనిపించింది.
ఆ ముగ్గురు అమ్మాయిల్లో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయే .. ఆ యువకుడ్ని దారుణంగా కొట్టింది. ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడు ఎవరు... ఆ యువతులు ఎవరు.. వారు ఎందుకు అతడ్ని కొడుతున్నారు.. అతడు చేసిన తప్పేంటి అన్న విషయాలు తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ మగాళ్ల మీద కోపం ఇలా ఆ ఒక్కడిపై చూపిస్తున్నారు’.. ‘ అంత దారుణంగా కొడుతున్నారంటే ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నదిలో పడిపోయిన కారు.. బయటకు లాక్కొచ్చిన ఏనుగు..
ప్రతిరోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..