Lemon Water: ప్రతిరోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
ABN , Publish Date - May 29 , 2025 | 02:36 PM
నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. అయితే, ప్రతి రోజు నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ నీళ్లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే తర్వగా బరువు తగ్గుతారని సూచిస్తున్నారు. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. అలా అని రోజు నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయ నీళ్లు అధిక పరిమాణంలో తీసుకుంటే అది ప్రయోజనానికి బదులుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని మెరుగుపరచడంలో, కడుపును తేలికగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ దాని ఆమ్ల స్వభావం కొంతమందికి హానికరం కావచ్చు.
హానికరం
ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్ లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగడం హానికరం. ఇది కడుపులో చికాకు, వాంతులు లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటు, రోజూ నిమ్మకాయ నీరు తాగడం వల్ల దంతాలపై ఉన్న ఎనామెల్ కూడా దెబ్బతింటుంది. దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, దంత క్షయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల నిమ్మకాయ నీరు తాగిన తర్వాత ఆమ్ల ప్రభావం తగ్గడానికి మీ నోటిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.
రోజుకు ఒకసారి
ఎప్పుడూ కూడా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకోని తాగాలి. చాలా చల్లగా లేదా వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది కాదు. మీకు గ్యాస్ లేదా అసిడిటీ సమస్య ఉంటే ఖాళీ కడుపుతో తాగడానికి బదులుగా అల్పాహారం తర్వాత తాగడం మంచిది. తేనె లేదా చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల దాని రుచి, లక్షణాలు రెండూ పెరుగుతాయి. రోజుకు ఒకసారి నిమ్మకాయ నీరు తాగితే సరిపోతుంది. తరచుగా తాగడం వల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. కాబట్టి, నిమ్మకాయ నీటిని అదే పనిగా తాగకండి. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్ర కూడా అవసరం. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే లేదా ఏదైనా మందులు తీసుకుంటుంటే నిమ్మకాయ నీరు తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read:
ఇంట్లో అద్దం చాలా మురికిగా ఉందా? ఇలా చేయండి..
రైలుకు వేలాడుతూ యువతి భయంకర విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..
For More Life Style News