Simple Tips: ఇంట్లో అద్దం చాలా మురికిగా ఉందా? ఇలా చేయండి..
ABN , Publish Date - May 29 , 2025 | 02:29 PM
మనల్ని మనల్నిగా చూపించే అద్దం మురికిగా ఉంటే.. అది మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అద్దం ప్రకాశవంతంగా ఉంటేనే మన దృష్టి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
తెల్లవారు లేచిన వెంటనే ఎవరైనా అద్దంలో ముఖం చూసుకుంటారు. అంతేకాదు అద్దం. మన ముఖాలను చూపించడమే కాదు, మనం ఎవరో కూడా మనకు అవగాహన కల్పిస్తుంది. మనం అలసిపోయిమా.. సంతోషంగా ఉన్నామా.. అనేది స్పష్టమవుతుంది.
మనల్ని మనల్నిగా చూపించే అద్దం మురికిగా ఉంటే.. అది మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అద్దం ప్రకాశవంతంగా ఉంటేనే మన దృష్టి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి దానిని క్రమం తప్పకుండా తుడిచి శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం అద్దాన్ని శుభ్రం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
టూత్‌పేస్ట్: అద్ధాన్ని టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయ వచ్చు. అద్దం తుడవడానికి ఒక పేపర్ తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పేస్ట్‌ని.. రెండు టేబుల్ స్పూన్ల నీటితో కలిపి అద్దం మీద వస్త్రంతో తుడవాలి. తరువాత 10 నిమిషాలు అలా ఉంచి.. ఆ తర్వాత వార్తాపత్రికతో అద్దాన్ని తుడవాలి. ఆ తర్వాత శుభ్రమైన తెల్లటి వస్త్రంతో తుడిస్తే.. అద్దం మిలమిలా మేరుస్తుంది.
వెనిగర్: ఇంట్లో ఏ వస్తువునైనా శుభ్రం చేయాలంటే వెనిగర్ తప్పనిసరి. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను రెండు టేబుల్ స్పూన్ల నీటితో కలిపి.. అద్దాన్ని తుడవాలి. అలా 10 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత పేపరుతో అద్దాన్ని తుడవాలి. దీంతో అద్దం శుభ్రంగా క్లీన్ అవుతుంది.
షేవింగ్ క్రీమ్: షేవింగ్ క్రీమ్‌ను కొద్దిగా నీటిలో కలిపి..అద్దానికి రాయాలి. అలా 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత పేపర్‌తో అద్దాన్ని తుడవాలి. అనంతరం మంచి క్లాత్ తీసుకుని అద్దాన్ని తుడవాలి. దీంతో అద్దం కొత్తదిలాగా మెరుస్తుంది.
టాల్కమ్ పౌడర్: అద్దం మెరిసేలా చేయడానికి టాల్కమ్ పౌడర్‌ను సైతం ఉపయోగించవచ్చు. తొలుత అద్దం మీద టాల్కమ్ పౌడర్ చల్లి కాసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత డస్టర్ లేదా కాగితంతో రుద్దితే.. అద్దం మెరుస్తున్నట్లు కనిపిస్తుంది.
నిమ్మరసం: నిమ్మరసాన్ని కొద్దిగా నీటితో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. దానిని అద్దంపై స్ప్రే చేసి.. ఫైబర్ టవల్‌తో తుడవాలి. ఆ తర్వాత అద్దం మెరిసిపోతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రేషన్ షాపుల ద్వారానే నిత్యవసర వస్తువుల పంపిణీ.. ఎందుకంటే..
ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
For AndhraPradesh News And Telugu News