ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tamilsai: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’తో.. ప్రజల జీవితం తామరపువ్వులా వికసిస్తుంది

ABN, Publish Date - May 27 , 2025 | 11:30 AM

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ద్వారా రాష్ట్ర ప్రజల జీవనం తామర పూవులా వికసిస్తుందని ఆమె అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక రాష్ట్రాభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల జీవనం కూడా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.

- బీజేపీ నేత తమిళిసై

చెన్నై: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ద్వారా రాష్ట్ర ప్రజల జీవనం తామర పూవులా వికసిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత తమిళిసై సౌందర్‌రాజన్‌ వ్యాఖ్యానించారు. తిరువొత్తియూర్‌లో ఇక్కడ జరిగిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే అంశం సదస్సులో తమిళిసై మాట్లాడుతూ... ఒకే దేశం-ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలను బర్త్‌రఫ్‌ చేస్తే ఏం చేయాలంటూ కొందరు స్వార్ధపూరిత రాజకీయ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తరచూ పిల్లలకు జన్మనిస్తుంటే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని,


అలాగే తరచూ ఎన్నికలు వస్తుంటే దేశం ఆర్ధికంగా నష్టపోతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక రాష్ట్రాభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల జీవనం కూడా అభివృద్ధి చెందుతోందని, ఈ విధానానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని తమిళిసై విజ్ఞప్తి చేశారు. తమిళిసై నేతృత్వం వహించిన ఈ సదస్సులో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో పాటు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌, జాతీయ కార్యదర్శులు అనిల్‌ ఆంటొనీ, అరవింద్‌ మేనన్‌,, తమిళనాడు-కర్నాటక కో ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ నేతలు కేఎస్‌ రాధాకృష్ణన్‌, ఎం.చక్రవర్తి, అర్జునమూర్తి, అమర్‌ ప్రసాద్‌ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

Read Latest Telangana News and National News

Updated Date - May 27 , 2025 | 11:30 AM