AI Judicial Services: హైకోర్టు న్యాయమూర్తుల్లో ఓబీసీలు 12.5శాతం..మంది
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:15 AM
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743
ఎస్సీలు 3, ఎస్టీలు 2.2 శాతం..
2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు 743 మంది న్యాయమూర్తుల నియామకం
తెలంగాణలో 16, ఏపీలో 9 ఖాళీలు: కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743 మందిలో 93 మంది ఓబీసీలు (12.5 శాతం), 23 మంది ఎస్సీలు (3 శాతం), 17 మంది ఎస్టీలు (2.2 శాతం) ఉన్నారని కేంద్రం తెలిపింది. అలాగే 105 మంది (14 శాతం) మహిళా న్యాయమూర్తులు ఉన్నారని వెల్లడించింది. గురువారం రాజ్యసభలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యంపై టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్ (ఏఐజేఎ్‌స)ను ప్రవేశపెట్టే విషయమై రాష్ట్రాలు, హైకోర్టుల మధ్య విభేదాలున్న కారణంగా ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక తెలంగాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పదవులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 9 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని మరో సభ్యుడు వివేక్ కే ఠంకా అడిగిన ప్రశ్నకు అర్జున్ రామ్‌మేఘ్వాల్ బదులిచ్చారు. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1,122 జడ్జి పదవులకు గానూ 362 ఖాళీలు ఉన్నాయని, 760 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని వివరించారు. జిల్లా కోర్టులకు సంబంధించి తెలంగాణలో 115, ఏపీలో 65 న్యాయధికారుల ఖాళీలు ఉన్నాయని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 01 , 2025 | 03:15 AM