North Korea: రష్యాకు 30 వేల మంది ఉత్తర కొరియా సైనికులు
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:03 AM
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మరింత సహకారం అందించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు..
కీవ్, జూలై 3: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మరింత సహకారం అందించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు.. దాదాపు 30,000 మంది ఉత్తర కొరి యా సైనికులు త్వరలో రష్యా సైన్యంలో చేరబోతున్నారు. వీరంతా రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎన్‌ఎన్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని కుర్స్క్ ప్రాంతంలో రష్యన్ నేవీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ మిఖాయిల్ గుడ్కోవ్ హత్యకు గురైనట్టు అధికారులు తెలిపారు. జనరల్ గుడ్కోవ్ తన బలగాలను సందర్శించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.
Updated Date - Jul 04 , 2025 | 04:03 AM