Kejriwal: కేజ్రీవాల్ పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు కోర్టు గ్రీన్‌సిగ్నల్
ABN, Publish Date - Jun 04 , 2025 | 09:47 PM
కేజ్రీవాల్ పాస్‌పోర్ట్ 2018లో గడువు ముగిసిందని, దానిని పది సంవత్సరాల పాటు పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మే 29న కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిని సీఐబీ, ఐడీ వ్యతిరేకించాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పాస్‌పోర్ట్‌ను 10 సంవత్సరాల పాటు పునరుద్ధరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఢిల్లీ కోర్టు బుధవారంనాడు పేర్కొంది. అవినీతి, మనీలాండరింగ్ స్కాముల్లో సీబీఐ, ఈడీ దర్యాప్తును కేజ్రీవాల్ ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్ పాస్‌పోర్ట్ 2018లో గడువు ముగిసిందని, దానిని పది సంవత్సరాల పాటు పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మే 29న కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిపై సీబీఐ, ఈడీ అభ్యంతరం తెలిపాయి.
దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి డిగ్ వినయ్ సింగ్ బుధవారంనాడు ఆదేశాలు జారీ చేస్తూ, అప్లికెంట్ (కేజ్రీవాల్) పాస్‌పోర్ట్‌ను 10 ఏళ్ల పాటు పునరుద్ధరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఆయన విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ అడగటం లేదని, సమీప భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే ఆలోచన కూడా ఉండకపోవచ్చని అన్నారు. ఆయన బెయిల్ కండిషన్‌లో కూడా కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతులు ఉన్నాయని చెప్పారు. ఆ దృష్ట్యా పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు దాఖలు చేసిన దరఖాస్తును అనుమతిస్తు్న్నామని, నిబంధనల ప్రకారం పదేళ్ల పాటు ఆయనకు పాస్‌పోర్ట్ పునరుద్ధరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ఇండియన్ పాస్‌పోర్ట్ యాక్ట్ ప్రకారం ఒక పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయడం, తిరస్కరించే అధికారం పాస్‌పోర్ట్ అధికారులకు ఉంటుందని, వారి ఆధికారానికి తమ ఆదేశాలు అడ్డంకి కావని జడ్జి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
షాకింగ్.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. 11 మంది మృతి
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందన.. పరిహారం ప్రకటన
For National News And Telugu News
Updated Date - Jun 04 , 2025 | 09:50 PM