ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

ABN, Publish Date - Apr 15 , 2025 | 06:16 PM

నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.

పాట్నా: ఈ ఏడాది చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో విపక్షాల వాదనలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తనయుడు నిషాంత్ కుమార్ (Nishant Kumar) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎన్డీయే తరఫున తన తండ్రే సీఎం అభ్యర్థి అని, నితీష్ నాయకత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పాట్నాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమిలో నితీష్ కుమార్ నాయకత్వాన్ని కేంద్ర మంత్రి అమిత్‌షా, బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కూడా ధ్రువీకరించారని చెప్పారు.

Muda Case: సీఎంకు ఎదురుదెబ్బ.. లోకాయుక్త పోలీసుల విచారణ కొనసాగింపు


ఎన్నికల తర్వాత నితీష్ కుమార్‌ను తప్పిస్తారంటూ విపక్షాలు చేస్తు్న్న ఆరోపణలపై నిషాంత్ స్పందిస్తూ.. ''ఆయన సీఎం ఎందుకు కాకూడదు?. అమిత్‌షా చెప్పారు, సామ్రాట్ చెప్పారు, దానిపై ఎలాంటి సందేహం లేదు" అని అన్నారు. నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు. 2010లో తన తండ్రికి ఇచ్చిన తీర్పుకంటే పెద్ద తీర్పును ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.


రాజకీయ ప్రవేశంపై...

రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై నిషాంత్‌ను అడిగినప్పుడు ఆయన నవ్వుతూ సమాధానం దాటవేశారు. నితీష్ మళ్లీ సీఎం అవుతారని, ప్రజల తీర్పుపై తనకు నమ్మకం ఉందని, బీహార్ ప్రజలు చాలా తెలివైన వాళ్లని, వారికి అన్నీ తెలుసునని అన్నారు. 2010 కంటే పెద్ద తీర్పును 2025 ఎన్నికల్లో ఎన్డీయేకు ఇవ్వాలని ప్రజలను మరోసారి కోరారు.


ఇవి కూడా చదవండి..

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 15 , 2025 | 06:18 PM