ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SBI ATM: ఏటీఎమ్ బద్దలు కొట్టి 27 లక్షలు దోచేశారు..

ABN, Publish Date - Jun 16 , 2025 | 07:32 PM

SBI ATM: గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఏటీఎమ్ సెంటర్ల లూటీని పరిశీలిస్తే.. దొంగలు సెక్యూరిటీ లేని ఏటీఎమ్ సెంటర్లను టార్గెట్ చేస్తున్నారు. అర్థరాత్రి తర్వాత వచ్చి దొంగతనాలు చేస్తున్నారు.

SBI ATM

కర్ణాటక రాష్ట్రంలో వరుసగా ఏటీఎమ్‌ సెంటర్లలో చోరీలు జరుగుతున్నాయి. దొంగలు ఏటీఎమ్‌లను బద్ధలు కొట్టి డబ్బులు దోచుకెళ్లిపోతున్నారు. ఎస్‌బీఐ ఏటీఎమ్‌లను టార్గెట్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా, కోలార్‌లోని ఓ ఎస్‌బీఐ సెంటర్‌లో దొంగతనం జరిగింది. దొంగలు ఏటీఎమ్‌ను బద్దలు కొట్టి డబ్బులు దోచుకెళ్లిపోయారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎమ్‌లో 27 లక్షల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. గాల్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకున దర్యాప్తు చేపట్టారు.

నెల రోజుల క్రితం కలబురిగిలోని రామనగర్ ఎస్‌బీఐ సెంటర్‌లో దొంగతనం జరిగింది. దొంగలు పక్కాప్లాన్‌తో ఏటీఎమ్‌లోని డబ్బుల్ని దోచుకెళ్లిపోయారు. ఏటీఎమ్‌లో డబ్బులు నింపిన మరుసటి రోజు రాత్రి చోరీకి పాల్పడ్డారు. దొంగలు మొదటగా సీసీటీవీ కెమెరాలను పని చేయకుండా చేశారు. తర్వాత గ్యాస్ కట్టర్‌కు పని చెప్పారు. ఏటీఎమ్‌ను గ్యాస్ కట్టర్ సాయంతో కోసి అందులోని డబ్బుల్ని దోచేశారు. దొంగతనం జరిగిన సమయంలో ఏటీఎమ్‌లో 18 లక్షల రూపాయలు ఉన్నాయి.

సెక్యూరిటీ లేని ఏటీఎమ్ సెంటర్లే టార్గెట్

గత కొన్ని నెలల నుంచి జరుగుతున్న ఏటీఎమ్ సెంటర్ల లూటీని పరిశీలిస్తే.. దొంగలు సెక్యూరిటీ లేని ఏటీఎమ్ సెంటర్లను టార్గెట్ చేస్తున్నారు. అర్థరాత్రి తర్వాత వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండటానికి సీసీటీవీ కెమెరాల్ని బ్లాక్ చేస్తున్నారు. ఏటీఎమ్ దొంగల్ని పట్టుకోవటం పోలీసులకు సవాలుగా మారింది. ఇది వరకు మంగళూరు, బీదర్‌లలోని ఏటీఎమ్ సెంటర్లలో కూడా దొంగతనాలు జరిగాయి. పోలీసులు ఇంకా ఆ దొంగల కోసం వెతుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాజా రఘువంశీ కేసు.. హత్యకు వాడిన కత్తి స్వాధీనం..

దర్శకుడు మిస్సింగ్.. విమాన ప్రమాదం జరిగిన చోట సెల్‌ఫోన్ సిగ్నల్స్..

Updated Date - Jun 16 , 2025 | 07:37 PM