Raja Raghuvanshi: రాజా రఘువంశీ కేసు.. హత్యకు వాడిన కత్తి స్వాధీనం..
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:55 PM
Raja Raghuvanshi Case: నిందితుల్లో ఒకడైన విశాల్ చౌహాన్ మొదటగా ఈ కత్తితో రాజా రఘువంశీపై దాడి చేశాడు. కత్తి దాడి నుంచి రాజా తనను తాను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజా రఘువంశీ హత్యకోసం వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ కత్తిని గువహటి రైల్వే స్టేషన్ దగ్గరి నుంచి తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకడైన విశాల్ చౌహాన్ మొదటగా ఈ కత్తితో రాజా రఘువంశీపై దాడి చేశాడు. కత్తి దాడి నుంచి రాజా తనను తాను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. తర్వాత శవాన్ని అక్కడికి దూరంగా తీసుకెళ్లి పడేశారు.
సినిమా లెవెల్లో మరో ప్లాన్
పోలీసుల విచారణలో మతి పోగొట్టే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఐదుగురు నిందితులు మరో హత్యకు కూడా కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రాజాను చంపిన తర్వాత.. ఎవరో ఒక మహిళను కూడా హత్య చేయాలని అనుకున్నారు. ఆ మహిళ శవాన్ని పూర్తిగా గుర్తు పట్టలేనంతగా కాల్చేసి.. దాన్ని సోనమ్ డెడ్ బాడీగా చూపించాలని ప్లాన్ చేశారు. సోనమ్ కోసం పోలీసులు వెతుకుతుండటంతో ఈ మర్డర్‌కు ప్లాన్ చేశారు. మర్డర్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. సోనమ్ పోలీసులకు లొంగిపోయింది.
వెలుగులోకి రాజా చివరి వీడియో..
హత్య జరగడానికి కొన్ని గంటల ముందు రాజా రఘువంశీ తన భార్య సోమన్‌తో కలిసి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న వీడియోను.. ఎమ్ దేవ్ సింగ్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘నేను మే 23న మేఘాలయలోని డబుల్ డెక్కర్ రూటులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఉదయం 9.45 నిమిషాలకు నేను కొండ మీదనుంచి కిందుకు వెళుతూ ఉంటే.. వాళ్లిద్దరూ పైకి వెళుతూ ఉన్నారు. అదే రాజా చివరి వీడియో కావచ్చు’ అని రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
దర్శకుడు మిస్సింగ్.. విమాన ప్రమాదం జరిగిన చోట సెల్‌ఫోన్ సిగ్నల్స్..
విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..