Share News

Viral video: విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:03 PM

Vishwash Kumar Ramesh: విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలగానే పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, పొగలు మొదలయ్యాయి. మెయిన్ రోడ్డు మీద ఉన్న జనాలు మొత్తం ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు.

Viral video: విమాన ప్రమాదం.. పొగలోంచి నడుచుకుంటూ బయటకొచ్చిన రమేష్..
Vishwash Kumar Ramesh

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం జూన్ 12వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడిపోయింది. దీంతో విమానంలోని 241 మంది చనిపోయారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఓ వ్యక్తి మాత్రమే ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతడే 40 ఏళ్ల బ్రిటీష్ ఇండియన్ విశ్వాష్ కుమార్ రమేష్. 11 ఏ సీటులో కూర్చున్న అతడు అదృష్టం కొద్దీ బయటపడ్డాడు.


ఎలా బతికి బయటపడ్డాడో అతడికి కూడా క్లారిటీ లేదు. దూరదర్శన్ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయం చెప్పాడు. ‘నేను ప్రాణాలతో ఎలా బయటపడ్డానో తెలీదు. ఒకానొక దశలో నేను చనిపోయానని అనుకున్నాను. నేను ఎప్పుడైతే కళ్లు తెరిచానో.. అప్పుడే నేను బతికి ఉన్నానని అర్థం అయింది. సీటు బెల్టు తీసేసి అక్కడినుంచి బయటకు వచ్చేశాను. ఎయిర్ హోస్టెస్, మా ఆంటీ, అంకుల్ అందరూ నా కళ్ల ముందే చనిపోయారు. విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే బిల్డింగ్‌పై పడిపోయింది’ అని చెప్పాడు.


విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలగానే పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, పొగలు మొదలయ్యాయి. మెయిన్ రోడ్డు మీద ఉన్న జనాలు మొత్తం ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు. గట్టిగా అరవటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్.. హాస్టల్ మెయిన్ గేటు నుంచి నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

ర్యాపిడో బైక్ డ్రైవర్‌తో గొడవ.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా..

రెచ్చిపోయిన మహిళ.. ఆ వ్యక్తి గుండెపై గన్నుపెట్టి..

Updated Date - Jun 16 , 2025 | 04:37 PM