Rahul Gandhi: మోదీకి ధైర్యం లేదు
ABN, Publish Date - Jul 31 , 2025 | 03:29 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నదంతా అబద్ధమని ప్రధాన మంత్రి మోదీ చెప్పలేకపోతున్నారని కాంగ్రెస్ విమర్శించింది.
ట్రంప్ అబద్ధాలాడుతున్నారని చెప్పలేకపోతున్నారు
అలా చేస్తే ఆయన నిజం బయటపెడ్తారు: రాహుల్
2 గంటల ప్రసంగంలో ఒక్కసారీ ట్రంప్ పేరెత్తలేదు
భారత్-పాక్ ఘర్షణలో మూడోపక్షం జోక్యాన్ని ఎందుకు అంగీకరించారు?: మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ, జూలై 30: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నదంతా అబద్ధమని ప్రధాన మంత్రి మోదీ చెప్పలేకపోతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ ఇప్పటికి దాదాపు 30సార్లు ప్రకటించుకోవడంపై మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ట్రంప్ అబద్ధం చెబుతున్నారని చెప్పే ధైర్యం మోదీకి లేదని ఎద్దేవా చేసింది. కాల్పుల విరమణ విషయంలో తన పాత్ర గురించి ట్రంప్ అబద్ధం చెబుతున్నారని మోదీ చెప్పలేరని, అలా చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజాన్ని బయట పెడతారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ‘ఒకవేళ ట్రంప్ చెప్పేది అబద్ధమని మోదీ చెబితే.. నిజం ఏమిటో ఆయనే బహిరంగంగా చెబుతారు. అందుకే ప్రధాని ఏమీ చెప్పలేకపోతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అబద్ధం చెబుతున్నారని చెప్పే ధైర్యం మోదీకి లేదని, ఈ వ్యవహారం మొత్తం అనుమానాస్పదంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. ఇదిలా ఉండగా, భారత తొలి ప్రధాని నెహ్రూను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో విమర్శించడంపై కాంగ్రెస్ మండిపడింది. వారి వైఫల్యాలకు సమాధానం చెప్పలేక దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించింది. నెహ్రూ విషయంలో మోదీ, అమిత్ షా ఇద్దరూ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) సమస్యతో బాధపడుతున్నారన్నవిషయం లోక్‌సభలో మరోసారి నిరూపితమైందని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News
Updated Date - Jul 31 , 2025 | 03:29 AM