ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bengaluru: బాలిక కిడ్నాప్, హత్య.. నిందితుడు ఎన్‌కౌంటర్..

ABN, First Publish Date - 2025-04-13T21:34:56+05:30

Bengaluru: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలో బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి సదరు యువకుడు పరారయ్యాడు. అతడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

బెంగళూరు, ఏప్రిల్ 14: కర్ణాటకలోని హుబ్బళీలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేసిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో మరణించాడని పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీస్ సైతం గాయపడ్డారని చెప్పారు. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు చుట్టు ముట్టి లొంగిపోవాలని సూచించారని తెలిపారు. కానీ అతడు పోలీసుల సూచనలను లక్ష్య పెట్టలేదన్నారు. అంతేకాకుండా.. పోలీసులపై అతడు దాడికి తెగబడ్డాడని.. దీంతో తమ కాల్పుల్లో అతడు మరణించాడని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

హుబ్బళీలో శనివారం ఐదేళ్ల చిన్నారని బిహార్‌ రాజధాని పాట్నాకు చెందిన నితీష్ కుమార్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ పాపను షెడ్‌లోని తీసుకు వెళ్లి అత్యాచారానికి యత్నించారు. ఇంతలో ఆ బాలిక బిగ్గరగా కేకలు వేసింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. షెడ్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించి నితీష్ కుమార్.. ఆ బాలికను హత్య చేసి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో స్థానిలంతా కలిసి భారీగా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన నితీష్ కుమార్‌ను తమకు అప్పగించాలని.. అతడిని ప్రజా కోర్టులో శిక్షిస్తామని పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా బిహార్ రాజధాని పాట్నాకు చెందిన నితీష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అతడిని పట్టుకొనేందుకు వారు యత్నించారు. అందులోభాగంగా అతడిని చుట్టుముట్టారు. లోంగిపోవాలని అతడిని పోలీసులు సూచించారు. కానీ వారిపైనే అతడు దాడికి యత్నించడంతో.. ప్రాణ రక్షణ కోసం అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నితీష్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. ఇంకోవైపు ఐదేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే బాలికపై అత్యాచారం జరిగినట్లు వారు ఎటువంటి ప్రకటన చేయలేదు. వైద్య నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - 2025-04-13T21:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising