Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. నిందితుడు అరెస్ట్
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:20 AM
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో నేవీలో విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి చెందారు. ఆ మృతదేహం పక్కన ఆతడి భార్య కూర్చొని రోధిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోను సైతం ట్రోల్ చేశాడు.
భోపాల్, ఏప్రిల్ 25: అసలు వాస్తవాలను పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో పోటోలు, వీడియోలను పోస్ట్ చేసి.. తమకు తోచింది ఏదో రాసేస్తున్నారు. ఈ తరహా వ్యక్తులు.. పలువురి ఆగ్రహానికి గురవుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వారు ఈ తరహా చర్యల కారణంగా వారిపై పోలీస్ కేసులు సైతం నమోదవుతున్నాయి. అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఏప్రిల్ 22వ తేదీ పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పుల్లో 26 మంది మరణించారు. ఆ జాబితాలో నేవీలో విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు.ఆ సమయంలో భర్త వినయ్ మృతదేహం వద్ద అతడి భార్య హిమాన్ష్ రోదిస్తోంది.
అందుకు సంబంధించిన ఫొటో.. మీడియాతోపాటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. ఆ ఫొటోను జబల్‌పూర్‌కు చెందిన ఒసఫ్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా.. చాలా దారుణంగా కామెంట్ చేశాడు. ఏమన్నాడంటే.. ఈ మహిళపై దర్యాప్తు జరగాలన్నారు. బహుశా ఆమె ఒక షూటర్‌ను ఏర్పాటు చేసుకొని.. తన భర్తను చంపేసి ఉండవచ్చునన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడ్డారు. అంతేకాదు ఒసఫ్ ఖాన్‌పై వారంతా మండిపడుతోన్నారు.
ఆ క్రమంలో దీనిపై అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒసఫ్ ఖాన్ వైద్య రంగంలో పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ఇంతటి దారుణంగా ట్రోల్ చేయబడిన హిమాన్ష్ భర్త వినయ్ నర్వాల్ కేరళలోని కొచ్చిలో నేవల్ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీన హిమాన్ష్‌తో హర్యానాలోని కర్నల్‌కు చెందని వినయ్ నర్వాల్ వివాహమైంది. ఏప్రిల్ 19వ తేదీన వివాహ రిసెప్షన్ జరిగింది. అంతరం హనీమున్ కోసం ఈ జంట అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం చేరుకొంది. అందులోభాగంగా బాలీవుడ్ సాంగ్‌కు ఈ జంట్ వేసిన స్టెప్స్ తాలుక వీడియో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ డ్యాన్స్ చేసిన జంట.. అనంతరం ఆ పక్కనే ఉన్న దుకాణం వద్ద బేల్ పూరి తింటున్నారు.
అదే సమయంలో ఉగ్రవాదులు అక్కడకు చేరుకొని.. మీరు ముస్లింలా కాదా అని అడిగి.. జవాబు చెప్పేలోగానే వినయ్ నర్వాల్‌పై కాల్పులు జరిపారు. దీంతో అతడు కుప్పుకూలిపోయాడు. దీంతో కొన్ని రోజుల ముందే.. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నీతోనే ఉంటానంటూ మూడు మూళ్లు వేసిన తన భర్త వినయ్ నర్వాల్.. కళ్ల ముందే విగత జీవిగా పడిఉండడంతో అక్కడే కూర్చొని హిమాన్ష్ రోదించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎవరు తూచినట్లు వారు రాసుకుంటూ పోయారు. అదీ కూడా కనీస మానవత్వం లేకుండా.
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్
For National News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 11:41 AM