ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maldives: అధ్యక్షుడు ముయిజు వ్యాఖ్యలు సరికాదు.. ఇండియాకు క్షమాపణ చెప్పాలి.. మాజీ మంత్రి

ABN, Publish Date - May 04 , 2025 | 08:50 AM

Maldives India Diplomatic Row: గతేడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో న్యూ ఢిల్లీతో మాకెలాంటి ఆందోళనలు లేవని తాజాగా వ్యాఖ్యానించడం దుమారం లేపుతోంది. తమ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఖండిస్తూ మాల్దీవుల మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

India Maldives Relations

India Maldives Relations: భారతదేశానికి మాల్దీవులకు మధ్య ఉన్న ఒప్పందాల విషయంలో తమకెలాంటి ఆందోళనా లేదని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీస్తోంది. దీనిని మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల ప్రచారంలో ముయిజు రాజకీయ కపటత్వంతో ప్రజలను తప్పుదారి పట్టించారని షాహిద్ ఆరోపించారు. మాల్దీవులు, భారతదేశ ప్రజలు ఇద్దరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, జరిగిన అనర్థాలకు పూర్తి వివరణ ఇవ్వాలని షాహిద్ డిమాండ్ చేశారు.

Updated Date - May 04 , 2025 | 08:55 AM