Love Triangle: ట్రయాంగిల్ లవ్.. ప్రియురాలితో ఉన్నాడన్న కోపంతో..
ABN, Publish Date - Aug 18 , 2025 | 10:53 AM
Love Triangle: తన మాజీ ప్రియురాలు వేరే వాడితో తిరగటం తట్టుకోలేకపోయాడు. ఆమె కొత్త ప్రియుడు చందన్‌పై పగ పెంచుకున్నాడు. చందన్‌ను చంపడానికి కుట్ర పన్నాడు. మాట్లాడాలని చెప్పి చందన్‌ను ఓ చోటుకు రప్పించాడు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువకుడి కొంపముంచింది. యువతి మాజీ ప్రియుడు యువకుడిపై కత్తితో దాడి చేశాడు. కత్తి దాడిలో గాయపడ్డ యువకుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, వ్యయాలికావల్ పోలీస్ స్టేషన్ పరిథికి చెందిన యతీష్, ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే, మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. బ్రేకప్ తర్వాత ఆ యువతి వేరే యువకుడ్ని ప్రేమించింది.
అతడి పేరు చందన్. ఇద్దరూ కలిసి షికార్లు చేసేవారు. ఈ విషయం యతీష్‌కు తెలిసింది. తన మాజీ ప్రియురాలు వేరే వాడితో తిరగటం తట్టుకోలేకపోయాడు. ఆమె కొత్త ప్రియుడు చందన్‌పై పగ పెంచుకున్నాడు. చందన్‌ను చంపడానికి కుట్ర పన్నాడు. మాట్లాడాలని చెప్పి చందన్‌ను ఓ చోటుకు రప్పించాడు. అక్కడ చందన్‌పై యతీష్, అతడి గ్యాంగ్ దాడి చేసింది. యతీష్ కత్తితో చందన్‌ను పొడిచాడు. అనంతరం అక్కడినుంచి వారంతా పరారయ్యారు. యతీష్ దాడిలో గాయపడ్డ చందన్ తన మిత్రులకు ఫోన్ చేశాడు.
ఏం జరిగిందో చెప్పాడు. అతడి స్నేహితులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. తీవ్ర గాయాలతో పడున్న చందన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న యతీష్, అతడి గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
గుండెలపై చనిపోయిన భార్య పచ్చబొట్టు వేయించుకున్న నటుడు
మీ పార్ట్‌నర్‌కు ఈ లక్షణాలున్నాయా? అయితే, నార్సిసిస్టిక్ డిజార్డర్ ఉన్నట్టే..!
Updated Date - Aug 18 , 2025 | 10:57 AM