Leopard: ఆ.. చిరుత చిక్కింది..
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:42 AM
తమిళ నాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో బాలికను హతమార్చిన చిరుత అటవీశాఖ ఏర్పాటుచేసిన బోనుకు చిక్కింది. పచ్చమలై ఎస్టేట్‌లోని తేయాకు తోటలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన మనోన్‌ముండా, మోనిక దంపతుల పెద్ద కుమార్తె రోషిణి ఇంటి బయట ఆడుకుంటుండగా చిరుత బాలికను నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది.
- ఊపిరి పీల్చుకున్న వాల్పారై ప్రజలు
చెన్నై: కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో బాలికను హతమార్చిన చిరుత అటవీశాఖ ఏర్పాటుచేసిన బోనుకు చిక్కింది. పచ్చమలై ఎస్టేట్‌లోని తేయాకు తోటలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన మనోన్‌ముండా, మోనిక దంపతుల పెద్ద కుమార్తె రోషిణి ఇంటి బయట ఆడుకుంటుండగా చిరుత బాలికను నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది.
బాలిక కోసం తల్లిదండ్రులు గాలించిన ఫలితం లేకపోయింది. ఆ తరువాత తీవ్ర గాయాలతో పొదల చాటున పడిన రోషిణి(Roshini) మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. మనిషి రక్తానికి అలవాటు పడిన చిరుత చేతిలో మరో దారుణం జరుగకముందే దానిని బంధించాలని ఆ ప్రాంత ప్రజలు అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
దీంతో చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు. గ్రామం నుంచి 50 మీటర్ల దూరంలో ఉంచిన బోనులో గురువారం ఉదయం 5 గంటల సమయంలో చిరుత చిక్కింది. పట్టుబడిన చిరుతను లారీలో దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించి విడిచిపెట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 27 , 2025 | 11:42 AM