ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Leopard: ఆహా.. చిరుత ఎంత దర్జాగా కూర్చుందో..

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:20 PM

రాయచూరు తాలూకాలోని డి.రాంపూర్‌ (డొంగరాంపూర్‌) సమీపంలోని పరమేశ్వర గుట్టలో మరో సారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపుతోంది.

- సమీప గ్రామాల ప్రజల్లో భయం.. భయం

రాయచూరు(బెంగళూరు): రాయచూరు తాలూకాలోని డి.రాంపూర్‌ (డొంగరాంపూర్‌) సమీపంలోని పరమేశ్వర గుట్టలో మరో సారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపుతోంది. గుట్టను ఆనుకుని గుడిసె వేసుకుని నివసిస్తున్న తాయప్ప అనే రైతుకు చెందిన రెండు మేక పిల్లలను చిరుత ఎత్తుకెళ్లడంతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోగా చిరుత సంచరిస్తున్నట్లు గుర్తులను కూడా తాము పసిగట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.

మే నెల చివరి వారంలో గుట్ట పై చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు రెండు బోన్లను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు చిరుత ఆ బోనుకు చిక్కలేదు. దీంతో మరో సారి గ్రామాన్ని సంచరించిన అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు. రెండేళ్ల మగ చిరుత గుట్ట పై సంచరిస్తున్నట్లు గతంలో గుర్తించామని బోను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు చిక్కకుండా తప్పించుకుపోయిందన్నారు.

మేత కోసం వచ్చిన చిరుత రెండు మేక పిల్లలను తినేసి ఉంటుందని అంచనా వేసిన అటవీశాఖ అధికారి రాము నాయక్‌, త్వరలోనే చిరుతను బంధిస్తామన్నారు. అదే సమయంలో పటటిపూట నలుగురు, రాత్రి వేళ ఇద్దరు సిబ్బందిని గస్తి కోసం ఉంచామని గ్రామస్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 12:20 PM