ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: మంత్రి ఆసక్తికర కామెంట్స్.. నాయకత్వ మార్పు హైకమాండ్‌ నిర్ణయం

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:05 PM

రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడి మార్పు హైకమాండ్‌ నిర్ణయమే తప్పా మరెవ్వరో చర్చించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి స్పష్టం చేశారు. అదే సమయంలో తమ స్థానాలు మిగిల్తే చాలంటూ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- మంత్రి సతీశ్‌ జార్కిహొళి స్పష్టీకరణ

- తమ స్థానం మిగిలితే చాలని వ్యాఖ్య

రాయచూరు(బెంగళూరు): రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడి మార్పు హైకమాండ్‌ నిర్ణయమే తప్పా మరెవ్వరో చర్చించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహొళి(Minister Satish Jarkiholi) స్పష్టం చేశారు. అదే సమయంలో తమ స్థానాలు మిగిల్తే చాలంటూ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా పర్యటనకు సోమవారం వచ్చిన మంత్రి ప్రగతి పరిశీలన సభ అనంతరం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడిమార్పు జరుగుతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే(AICC President Mallikarjun Kharge)నే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారంటూ మాజీ మంత్రి హెచ్‌ విశ్వనాథ్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొట్టిపారేశారు. తమ పార్టీ వ్యవహారాల గురించి ఆయన ఎలా మాట్లాడతారని ఎదురు ప్రశ్నించారు.

కులగణనకు సంబంధించి పునఃసమీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కొన్ని సామాజిక వర్గాల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధంగా ఉందన్నారు. కులగణనకు సంబంధించి గతంలో రూ.160 కోట్లు ఖర్చయ్యాయని 7 కోట్ల కన్నడ ప్రజల అభిప్రాయాలను గౌరవించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

జూరాల బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించి మూడు వంతెనల నిర్మాణాలను త్వరలోనే అధికారులతో సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో చేపట్టిన 50 జాతీయ రహదారుల నిర్మాణాల్లో 30 పూర్తయ్యాయని, మిగిలిన 20 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి వివరించారు. రాయచూరు నగరంలో రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి తమ శాఖ పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే శాఖాపరమైన అధికారులతో సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 01:05 PM