Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం
ABN, Publish Date - Jul 04 , 2025 | 05:17 PM
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. షాహి ఈద్గా మసీద్ వివాదాస్పద నిర్మాణమంటూ హిందూపక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ముస్లింలకు భారీ ఊరట లభించినట్లయింది.
ప్రయాగ్‌రాజ్, జులై 04: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణ జన్మభూమిలో షాహి ఈద్గా మసీదును భవిష్యత్తులో వివాదాస్పద నిర్మాణంగా పేర్కొనాలంటూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం నాడు హైకోర్టు కొట్టివేసింది. ఈ మసీదును భవిష్యత్తులో వివాదాస్పద నిర్మాణంగా పేర్కొనాలంటూ హిందువాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టేసింది. పూర్తి విచారణకు ముందు మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించడం తుది తీర్పుపై ప్రభావం చూపిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే షాహి ఈద్గా మసీదు వివాదాస్పద నిర్మాణమంటూ మహేందర్ ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముస్లింలు రాత పూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ముస్లిం పక్షానికి భారీ ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం ఈ కేసును సింగిల్ జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో హిందువుల వైపు నుంచి ప్రస్తుతం 18 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
పాక్ మద్దతుగా భారత్‌పై ఆయుధాలు ప్రయోగించిన చైనా
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
Read latest National News And Telugu News
Updated Date - Jul 04 , 2025 | 09:17 PM