ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi defense meeting: మోదీ ఉన్నతస్థాయి సమావేశం

ABN, Publish Date - May 10 , 2025 | 04:10 AM

పాక్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ రక్షణ శాఖ ఉన్నత అధికారులతో భద్రతా సన్నద్ధతపై చర్చించారు. గుజరాత్‌ ప్రభుత్వం బాణసంచా, డ్రోన్లపై నిషేధం విధించింది.

త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ

మాజీ అధికారులతో చర్చలు.. సరిహద్దుల్లో భద్రతపై ఆరా

న్యూఢిల్లీ, మే 9: పాక్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం రక్షణశాఖకు సంబంధించి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోభాల్‌, సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌, త్రివిధ దళాధిపతులు.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠితో ప్రధాని భేటీ అయ్యారు. దేశ భద్రత సన్నద్ధతపై ఆరా తీశారు. భవిష్యత్తు కార్యాచరణపైనా వారితో చర్చించినట్లు సమాచారం. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధ్యక్షులు, వాటిలో పనిచేసి రిటైరయిన పలువురు సీనియర్‌ అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. వారితో కీలక విషయాలపై చర్చించారు. మరోవైపు గుజరాత్‌ ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్‌ చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా, డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:10 AM