MLA: లంచం ఇస్తేనే ఇళ్ల మంజూరు.. హౌసింగ్ శాఖలో పైసలతోనే పని
ABN, Publish Date - Jun 21 , 2025 | 01:00 PM
హౌసింగ్‌శాఖలో ఇల్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల్సి వస్తోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీఆర్ పాటిల్(BR Patil), గృహనిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి సర్ఫరాజ్‌ఖాన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది.
- మంత్రి పీఎస్‌తో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వ్యాఖ్యలు
- ఆడియో వైరల్
బెంగళూరు: హౌసింగ్‌శాఖలో ఇల్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల్సి వస్తోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీఆర్ పాటిల్(BR Patil), గృహనిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి సర్ఫరాజ్‌ఖాన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. రాష్ట్రరాజకీయాల్లో ఈ ఆడియో కుదిపేస్తోంది. మంత్రి పీఎ్‌సకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఇళ్లమంజూరు విషయంలో మాట్లాడుతూ ఆళంద నియోజకవర్గంలో ఇళ్ల కేటాయింపులకు లంచం తీసుకున్నారని, అఫ్జల్‌పుర నియోజకవర్గంలోనూ లంచం తీసుకుని ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు.
సదరు ఆడియో వైరల్ కాగా ప్రతిపక్షనాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ పాటిల్ ఆరోపణలు చేయగా పీఎస్ బదులివ్వలేదంటే లంచాన్ని అంగీకరించినట్లే అని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సర్ఫరాజ్‌ఖాన్ శుక్రవారం వివరణ ఇచ్చారు.
ప్రజాప్రతినిధి అనే కారణానికి నేను మాట్లాడానని, కానీ ఆడియో వైరల్ చేయడం సరికాదన్నారు. ఆడియోలోనూ స్పష్టంగా లంచం తీసుకున్నవారు ఎవరో తెలిపితే జైలుకు పంపుతామని తెలిపానన్నారు. నాది ఐఫోన్ అని, ఇందులో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉండదన్నారు. ఆయనే రికార్డ్ చేసి లీక్ చేసి ఉండవచ్చునన్నారు. ప్రభుత్వంపై సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆరోపణలు ముఖ్యమంత్రితోపాటు మంత్రులందరికీ సంకటం తెచ్చిపెట్టింది.
నోరు తెరిస్తే... ప్రభుత్వమే గడగడ..
నా దగ్గర ఉన్న సమాచారం అంతా బహిర్గతం చేస్తే ప్రభుత్వమే గడగడలాడనుందని ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వ్యాఖ్యల ఆడియో శుక్రవారం వైరల్ అయ్యింది. ఆళంద నియోజకవర్గంలో నేను సిఫారసు చేసిన వారికి ఇళ్లు మంజూరు చేయలేదని, కానీ సర్పంచ్‌వంటి సిఫారసు చేసినా వచ్చాయన్నారు.
వివాదాలకు కేంద్రంగా బీఆర్ పాటిల్...
కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఏదో ఒక వివాదంలో సంచలనంగా మారుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగైదు నెలల్లోనే కొందరు మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీనియర్‌లు అనే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మాట్లాడారు. ఆ తర్వాత అభివృద్ధికి గ్రాంట్లు విడుదల కావడం లేదని, పలువురు ఎమ్మెల్యేలతో కలసి ముఖ్యమంత్రికి నేరుగా లేఖ రాశారు.
ఇదే సందర్భంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో సీఎం బుజ్జగించారు. సీఎం రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. కొన్ని నెలలకే సదరు రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హోదాకు రాజీనామా చేశారు. దీంతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. తాజాగా ఆడియో వివాదం వైరల్ కావడం పార్టీలో కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 21 , 2025 | 01:00 PM