ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kamal Haasan: హిందీపై కమల్ హాసన్ హాట్ కామెంట్స్

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:49 PM

1981లో విడుదలైన తన చిత్రం 'ఏక్ దుజే కేలియే'ను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఎలాంటి ఇంపొజిషన్ లేకుండానే హిందీని నేర్చుకున్నామని నటుడు కమల్ హాసన్ తెలిపారు. అదొక ఎడ్యుకేషన్ అని అన్నారు. పంజాబీ, కర్ణాటక, ఆంధ్ర భాషలన్నా తనకు అభిమానమేనని చెప్పారు.

Kamal Haasan

చెన్నై: నటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) ఇటీవల భాషా వివాదంలో చిక్కుకోవడంతో కర్ణాటకలో ఆయన సినిమా 'థగ్ లైఫ్' విడుదలకు నోచుకోలేదు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ ఈవెంట్‌లో తమిళం నుంచి కన్నడం పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర నిరసనలకు దారితీశాయి. కమల్ క్షమాపణ చెప్పకుంటే కన్నడంలో సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు వచ్చినా కమల్ అందుకు నిరాకరించారు. దీంతో కర్ణాటక మినహా అన్నిచోట్లా జూన్ 5న థగ్ లైఫ్ చిత్రాన్ని విడుదల చేశారు. తాజాగా కమల్ హాసన్ దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దడంపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.

1981లో విడుదలైన తన చిత్రం 'ఏక్ దుజే కేలియే'ను ప్రస్తావిస్తూ, ఆ సమయంలో ఎలాంటి ఇంపొజిషన్ లేకుండానే హిందీని నేర్చుకున్నామని కమల్ హాసన్ తెలిపారు. అదొక ఎడ్యుకేషన్ అని అన్నారు. పంజాబీ, కర్ణాటక, ఆంధ్ర భాషలన్నా తనకు అభిమానమేనని, హిందీని బలవంతంగా రుద్దడాన్ని కేవలం ఇక్కడ మాత్రమే వ్యతిరేకించడం లేదని అన్నారు.

'అంతర్జాతీయ స్థాయిలో మనం సక్సెస్ కావాలంటే అప్పుడు తప్పనిసరిగా భాష నేర్చుకోవాలి. ఇంగ్లీషు భాష అందుకు అనుగుణంగా ఉంటుందని భావించాం. స్పానిష్, చైనీస్ కూడా నెర్చుకోవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా చెప్పాలంటే 350 సంవత్సరాలుగా 350 ఏళ్ల ఆంగ్ల విద్యను క్రమక్రమంగా, నిలకడగా నేర్చుకుంటూ వచ్చాం. అకస్మాత్తుగా దానిని మారిస్తే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. ఇందువల్ల అనేక మందిని నిరక్షరాస్యులుగా మార్చడం అవుతుంది. ముఖ్యంగా తమినాడులో ఆ పరిస్థితి ఉంటుంది. అకస్మాత్తుగా అందర్నీ హిందీ మాట్లాడటం నేర్చుకోమ్మని బలవంతం చేస్తే ప్రతిఒక్కరూ ఆలోచనలో పడతారు. నా భాష పరిస్థితి ఏమిటి? 22 అధికారిక భాషల్లో నేను లేనా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి' అని కమల్ అన్నారు. త్రిభాషా విధానం పేరుతో హిందీని తమిళనాడుపై బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే ఇప్పటికే వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే కమల్‌ హాసన్‌ను తమిళనాడు నుంచి రాజ్యసభ అభ్యర్థిగా డీఎంకే ఇటీవల ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

బీజేపీకి యూట్యూబర్ మనీష్ కశ్యప్ గుడ్‌బై

జస్బీర్‌ ఫోన్‌లో 150 పాకిస్థాన్‌ కాంటాక్టులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 05:08 PM