ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN, Publish Date - May 26 , 2025 | 06:20 PM

ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

హిసార్: పాకిస్థాన్‌తో గూఢచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)కు హిసార్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. మల్హోత్రా నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌‌ తాజాగా నివేదిక ఇచ్చింది. ఆమెకు పాక్‌తో సంబంధాలున్నాయనడానికి కచ్చితమైన సాక్ష్యాలున్నాయని ఫోరెన్సిక్ పరిశీలనలో తేలినట్టు సమాచారం. దీంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు.


జ్యోతి మల్హోత్రా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి 12టీబీ డిజిటల్ డాటా రికవరీ చేశామని పోలీసు వర్గాలు తెలిపాయి. కనీసం నలుగురు పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐఓ)తో ఆమె ముఖాముఖి సంభాషణలు (chats) జరిపినట్టు ఫోరెన్సిక్ విశ్లేషణ చెబుతోందని, పాకిస్థాన్‌లో పర్యటించనప్పుడల్లా ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చారనడానికి సాక్ష్యాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్‌మెన్‌లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.


కాగా, మల్హోత్రాకు విదేశాల నుంచి నిధులు అందేవనే సమాచారంపై ఇంకా ఒక నిర్దారణకు రావాల్సి ఉందని, ప్రస్తుతం ఈ దశలో పోలీస్ రిమాండ్ కోరలేమని హిసార్ పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిజిజల్ సాక్ష్యాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అయితే సరైన సమయంలో మల్హోత్రాను అరెస్టు చేయడం వల్ల కీలక జాతీయ భద్రతా సంక్షోభం తలెత్తకుండా నివారించగలిగామని అన్నారు.


ఇవి కూడా చదవండి..

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 26 , 2025 | 06:33 PM