ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

JK LG Manoj Sinha: ఉగ్రవాదులను వేటాడండి... ఆర్మీ చీఫ్‌ను కోరిన ఎల్జీ మనోజ్ సిన్హా

ABN, Publish Date - Apr 25 , 2025 | 03:51 PM

భారత సైన్యం, పోలీసులు, సీఏపీఎఫ్ఎస్‌ల ధైర్యసాహసాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్ర దాడులకు పాల్పడిన వారితో పాటు వారికి సహాయసహకారాలు అందిస్తున్న మొత్తం నెట్‌వర్క్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ఆర్మీ చీఫ్ ద్వివేదిని ఎల్జీ సిన్హా కోరారు.

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను వేటాడటంతో పాటు టెర్రరిజం నెట్‌వర్క్‌‌ను సమూలంగా తుదముట్టించాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi)ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితిని సమీక్షించేందుకు ద్వివేది శుక్రవారం ఉదయం శ్రీనగర్ వచ్చారు. ఎల్జీ మనోజ్ సిన్హాను కలుసుకున్నారు.

Supreme Court: సావర్కర్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌ను మందలించిన సుప్రీంకోర్టు


భారత సైన్యం, పోలీసులు, సీఏపీఎఫ్ఎస్‌ల ధైర్యసాహసాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్ర దాడులకు పాల్పడిన వారితో పాటు వారికి సహాయసహకారాలు అందిస్తున్న మొత్తం నెట్‌వర్క్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ఈ సందర్భంగా ద్వివేదిని ఎల్జీ సిన్హా కోరారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు, వారికి మద్దతిచ్చిన వ్యక్తులు ఎక్కడి వారో, వారికి ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయో వెలికితీసి వారిని వేటాడాలన్నారు. అమాయక పౌరులపై అత్యంత హేయమైన, పిరికిపంద చర్యకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.


సెక్యూరిటీ ఏజెన్సీల మధ్య సమన్వయం, తీసుకోవాల్సిన స్పల్పకాలిక, దీర్ఘకాలికి భద్రతా చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. జీఓసి-ఇన్-సి-నార్తరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, జీఓసి 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాత్సవ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

For National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 03:54 PM