Jammu Kashmir: పహల్గాంలో ఉగ్రదాడి.. గాయపడిన ఏడుగురు టూరిస్టులు
ABN, Publish Date - Apr 22 , 2025 | 04:48 PM
టెర్రరిస్టులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఉగ్రవాదులు 3 నుంచి 5 నిమిషాల సేపు కాల్పులు జరిపి పరారయ్యాయనీ, సుమారు ఐదు నుంచి ఆరుగురు గాయపడ్డారని అధికాలు చెబుతున్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హహల్గాం (Pahalgam)లోని ఓ రిసార్ట్‌పై మంగళవారంనాడు ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సుమారు ఏడుగురు టూరిస్టులు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే పహల్గాం టూరిస్ట్ టౌన్ బైసరన్ ఘాటీకి ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు చేరుకున్నట్టు సీనియర్ అధికారులు ధ్రువీకరించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్‌ల ఎస్కార్ట్.. అరుదైన గౌరవం
3 నుంచి 5 నిమిషాలు కాల్పులు
టెర్రరిస్టులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఉగ్రవాదులు 3 నుంచి 5 నిమిషాల సేపు కాల్పులు జరిపి పరారయ్యాయనీ, సుమారు ఐదు నుంచి ఆరుగురు గాయపడ్డారని అధికాలు చెబుతున్నారు. అనంతనాగ్ జిల్లా ఆసుపత్రికి వారిని తరలించగా ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతుండటంతో గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఘటనా స్థలికి సహాయక సిబ్బంది చేరుకోగా, పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, తన భర్త తలకు గాయమైందని, మరో ఏడుగురు గాయపడ్డారని కాల్పుల ఘటనలో తృటిలో తప్పించుకున్న ఒక మహిళ ఫోనులో తెలిపారు. తన పేరు చెప్పనప్పటికీ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కిష్ట్వార్‌లో హై-టెక్ ఉగ్రస్థావరం
కాగా, ఈనెల 14న భద్రతా దళాలు కిష్ట్వార్ జిల్లాలోని చత్రు అటవీ ప్రాంతలో అత్యంత అధునాతన సౌకర్యాలతో, ముందస్తు వ్యూహంతో ఏర్పాటు చేసిన టెర్రిరిస్టు శిబిరాన్ని భధ్రతా బలగాలు కనిపెట్టాయి. పాకిస్థాన్ బేస్డ్ జైషే మొహమ్మద్ (జేఈఎం) అనుబంధం టెర్రరిస్టులు దీనిని స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్టు భద్రతాధికారులు అనుమానిస్తున్నారు.
ఇవి కూాడా చదవండి..
Mamata Banejee: మీ ఉద్యోగాలు, జీతాలు సేఫ్.. విధుల్లోకి చేరండి: మమత
Justice Surya Kant: న్యాయ వ్యవస్థపై ప్రతీ రోజూ దాడి జరుగుతోంది..
Updated Date - Apr 22 , 2025 | 04:50 PM