Share News

Justice Surya Kant: న్యాయ వ్యవస్థపై ప్రతీ రోజూ దాడి జరుగుతోంది..

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:10 PM

Justice Surya Kant: భారత రాష్ట్రపతి, గవర్నర్లు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటూ సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, బీజేపీ ఎంపీ నిశికాంత్ ధూబే సుప్రీం కోర్టు నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.

Justice Surya Kant: న్యాయ వ్యవస్థపై ప్రతీ రోజూ దాడి జరుగుతోంది..
Justice Surya Kant

న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. భారత రాష్ట్రపతి, గవర్నర్లు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటూ సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, బీజేపీ ఎంపీ నిశికాంత్ ధూబే సుప్రీం కోర్టు నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జస్టిస్ సూర్య కాంత్ స్పందించారు. సుప్రీంకోర్డు నిర్ణయంపై విమర్శలు చేస్తున్న వారిపై మండిపడ్డారు.


‘ మేమేం బాధపడ్డం లేదు. ప్రతీ రోజు న్యాయ వ్యవస్థపై దాడి జరుగుతూనే ఉంది’ అని అన్నారు. అయితే, సుప్రీం కోర్టు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను బీజేపీ వర్గాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తరచుగా సుప్రీం కోర్టుపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే రాజ్యాంగానికి మాస్టర్లు. వాళ్లకంటే పై స్థాయి వారు ఎవరూ లేరు’ అని అన్నారు. ఆర్టికల్ 142 విషయంలోనూ భారత అత్యున్నత న్యాయ స్థానంపై మండిపడ్డారు.


ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో.. 1975లో అమలైన ఎమర్జెన్సీ గురించి కూడా ఆయన మాట్లాడారు. భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఆనాడు సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా తీసుకుందని ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం సంయమనం పాటిస్తోంది. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ డెమోక్రసీలోని అన్ని పిల్లర్లు చాలా చక్కగా పని చేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ, చట్ట సభలు నాణేనికి రెండు వైపుల లాంటివి’ అని అన్నాయి.


ఇవి కూడా చదవండి

Viral Video:ఈ పిల్లాడు మామూలోడు కాదు.. బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదని పోలీస్ కంప్లైంట్..

Viral Video: విజయనగరం కాలేజీలో లెక్చరర్‌పై విద్యార్థిని చెప్పు దాడి

Updated Date - Apr 22 , 2025 | 04:10 PM