Viral Video: విజయనగరం కాలేజీలో లెక్చరర్‌పై విద్యార్థిని చెప్పు దాడి
ABN , Publish Date - Apr 22 , 2025 | 02:47 PM
Vizianagaram College: తన ఫోన్ తిరిగి ఇవ్వకపోతే చెప్పుతో కొడతానని విద్యార్థిని అంది. ఆ వెంటనే తన చెప్పు తీసి లెక్చరర్‌పై దాడి చేసింది. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పీటీ టీచర్‌తో పాటు ఇంకో లేడీ వచ్చి విద్యార్థినిని పక్కకు తీసుకువచ్చారు. ఈ గొడవకు లెక్చరర్ ఫోన్ తీసుకోవటం ఓ కారణం అయితే..
ఈ కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయటం లేదు. ఒకప్పుడు గురువులు పిల్లల్ని చావగొట్టినా.. నోరు మెదిపేవారు కాదు. తల్లిదండ్రులు కూడా ‘చదువు చెప్పే వాడు కొడితే ఏముంది?’ అనే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. తల్లిదండ్రులు కొట్టినా పిల్లలు సహించటం లేదు. అలాంటిది గురువులు ఇబ్బంది పెడితే ఊరుకుంటారా?.. తాజాగా, ఓ కాలేజీలో ఓ విద్యార్థిని లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్ధిని ఈ పని చేసింది.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. విజయనగరంలో ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని ఫోన్‌ను లెక్చరర్ తీసుకుంది. విద్యార్ధిని తన ఫోన్ తిరిగి ఇవ్వమని అడిగింది. ఆ లెక్చరర్ ఇందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థిని లెక్చరర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను తిట్టసాగింది. తన ఫోన్ తిరిగి ఇవ్వకపోతే చెప్పుతో కొడతానని విద్యార్థిని అంది. ఆ వెంటనే తన చెప్పు తీసి లెక్చరర్‌పై దాడి చేసింది. ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
పీటీ టీచర్‌తో పాటు ఇంకో లేడీ వచ్చి విద్యార్థినిని పక్కకు తీసుకువచ్చారు. ఈ గొడవకు లెక్చరర్ ఫోన్ తీసుకోవటం ఓ కారణం అయితే.. ఫోన్లను తీసుకుని అధికంగా ఫైన్లు వేయటం మరో కారణంగా తెలుస్తోంది. 12 వేల రూపాయల ఫోన్ తీసుకుని ఇవ్వకపోవటంతో విద్యార్థిని గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ ఇక్కడ పిల్లలది తప్పు కాదు.. వాళ్ల తల్లిదండ్రులదే తప్పు. పిల్లల్ని చాలా గారాభం చేసి పెంచుతున్నారు. వాళ్లు ఇలా తయారవుతున్నారు’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం