Investigation of Five Tamilians: ఐదుగురు తమిళుల విచారణ
ABN, Publish Date - Aug 10 , 2025 | 05:05 AM
ధర్మస్థల వివాదంలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. గతంలో ధర్మస్థలలో పారిశుధ్య కార్మికులుగా
ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు
రహస్యంగా మృతదేహాలు పూడ్చడం చూశాం
సిట్ అధికారుల వద్దకు ఇద్దరు వ్యక్తులు
బెంగళూరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ధర్మస్థల వివాదంలో రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. గతంలో ధర్మస్థలలో పారిశుధ్య కార్మికులుగా పనిచేసిన ఐదుగురు తమిళనాడు వాసులను సిట్ అధికారులు విచారించారు. వీరు 1995 నుంచి 2014 మధ్య అక్కడ పనిచేశారు. ధర్మస్థల ప్రాంతంలో మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ ఐదుగురిని తమిళనాడు నుంచి రప్పించారు. మరోవైపు శనివారం తవ్వకాల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటివరకు ఫిర్యాదుదారుడు చూపిన 13 ప్రదేశాల్లో 12 చోట్ల తవ్వకాలు ముగిశాయి. ఇవి కాకుండా 14, 15, 16వ పాయింట్లలోనూ తవ్వకాలు జరిగాయి. ఇప్పటివరకూ నేత్రావతి నది ఒడ్డున, ఓ గుట్టపైన తవ్వకాలు కొనసాగాయి. ఫిర్యాదుదారుడు వాటన్నింటికీ భిన్నంగా ధర్మస్థలకు వెళ్లే రత్నగిరి కొండలలో 16వ ప్రదేశాన్ని చూపించారు. అక్కడ ఐదు అడుగుల లోతు, ఐదు అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో కొత్తగా మట్టి వేసినందున మరో 2-3 అడుగులు తవ్వాలని ఫిర్యాదుదారుడు సిట్ అధికారులను కోరారు. రోడ్డు మలుపుతో పాటు ఓ చెట్టును గుర్తు పెట్టుకుని 16వ పాయింట్‌ను చూపించారు. కాగా, మృతదేహాలను రహస్యంగా పూడ్చడాన్ని తాము చూశామం టూ ఇద్దరు వ్యక్తులు సిట్ అధికారులను కలిశారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో వివరాలు తెలపాలని వారికి సిట్ సూచించింది. దీంతో వారు ధర్మస్థల పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి సాక్ష్యాన్ని సిట్ పరిగణనలోకి తీసుకోనుంది.
Updated Date - Aug 10 , 2025 | 05:05 AM